NRI-NRT

తెలుగు విద్యార్థులను అందుకే పంపించి ఉండవచ్చు. విద్యార్థులకు తెలుగు సంఘాల ఆసరా.

తెలుగు విద్యార్థులను అందుకే పంపించి ఉండవచ్చు. విద్యార్థులకు తెలుగు సంఘాల ఆసరా.

అమెరికాలో చదువుకోవడం కోసం వెళ్లిన 21మంది తెలుగు విద్యార్థులను అక్కడి ఇమిగ్రేషన్‌/భద్రతా అధికారులు ఎయిర్‌పోర్టు నుంచే తిప్పిపంపేశారు. ఎందుకు పంపేస్తున్నారనే దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. బలవంతంగా విమానం ఎక్కించి వెనక్కి పంపారు. ఇలా అట్లాంటా, శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగో ప్రాంతాల నుంచి 21 మందిని తిప్పిపంపినట్టు తెలిసింది.

పత్రాలు, వివరాలన్నీ పరిశీలించాకే అమెరికా వీసా ఇస్తారని, అలాంటప్పుడు ఈ సమస్య ఎందుకొచ్చిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పలువురు తెలుగు విద్యార్థులు బ్యాంక్‌ ఖాతాలో సొమ్మును చూపిన అంశంపై అమెరికా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఖాతాలో ఒకేసారి భారీగా డబ్బులు పడటం, లావాదేవీలు సక్రమంగా లేకపోవడాన్ని గుర్తించి, తిప్పి పంపారనేది మరో అభిప్రాయం. అమెరికాకు వచ్చే విద్యార్థుల సోషల్‌ మీడియా ఖాతాలను ఆ దేశ ఇమిగ్రేషన్‌ విభాగం క్షుణ్నంగా పరిశీలిస్తోంది. వీసాకు అనుమతించిన మరుక్షణమే నిఘా పెడుతోంది. అందులో అమెరికా నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు, సమాచారం, వ్యాఖ్యలు ఉంటే వాటి ఆధారంగా ఎయిర్‌పోర్టులోనే ఆపేస్తున్నారు. ఉదాహరణకు భారత విద్యార్థి అమెరికా వస్తూ.. ఇక్కడి స్నేహితులతో అమెరికాలో చదువుకునే రోజుల్లో ఉండే పార్ట్‌టైం ఉద్యోగాల గురించి వాకబు చేశాడు. ఇది నిబంధనలకు విరుద్ధంగా పరిగణించి వెనక్కి పంపిస్తారు.

తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, కార్యదర్శి కొల్లా అశోక్‌బాబు, టీంస్క్వేర్ ఛైర్మన్ మందలపు రమేష్‌లు మూర్తి సంస్థ న్యాయవాదులతో గురువారం నాడు చర్చించి వారిపై విధించిన 5ఏళ్ల నిషేధాన్ని తొలగించేలా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరో వైపు ఆటా, నాటా, నాట్స్ వంటి సంస్థలు కూడా విద్యార్థులకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నాయి.