Devotional

పువ్వులు ఎందుకు తుంచి పూజ చేయకూడదు అంటే?

పువ్వులు ఎందుకు తుంచి పూజ చేయకూడదు అంటే?

భగవంతుడి పూజలో పువ్వులు ఉపయోగిస్తాం. ఎవరికి అందుబాటులో ఉన్న పువ్వులతో వారు పూజిస్తారు. పెరట్లో పూవులతో పూజ ఉత్తమం అని .. ఎవరింట్లో అయినా కోసి తెచ్చిన పువ్వులతో పూజ మధ్యమం అని.. కొనుక్కుని తెచ్చి పువ్వులతో చేసే పూజ అధమం అని చెబుతారు. కానీ అపార్ట్ మెంట్ లైఫ్‌లలో మొక్కలను పెంచడానికి సరైన స్థలం లేక ఇప్పుడు అంతా పువ్వులు కొనే పరిస్థితి కనిపిస్తోంది. భగవంతుడి పూజలో ఏ పువ్వులు ఉపయోగించాలి? ఏవి వాడకూడదు? పువ్వులు ఎందుకు తుంచి పూజ చేయకూడదు అంటే?ఈశ్వరుడిని పూజలో మారేడు దళాలు, మోదుగ పుష్పాలు, మల్లెపూలు ఉపయోగించ్చునట. దేశవాళీ పుష్పాలు ఏవైనా పూజలకు వినియోగించవచ్చని ముఖ్యంగా ఇంట్లో పూసే పుష్పాలతో పూజ చేస్తే దేవతల అనుగ్రహం సిద్ధిస్తుందని శాస్త్రం చెబుతోంది. విష్ణుమూర్తిని పూజించేవారు పసుపురంగు పుష్పాలు, గణపతికి గన్నేరు పువ్వులు, దుర్గాదేవి పూజలో మందార పువ్వులు ఉపయోగించాలి. నీలంరంగు పువ్వులను శనిదేవుడిని పూజలో ఉపయోగించవచ్చునట.

మొగలిపువ్వును పూజలో వినియోగించకూడదు అంటారు. మొగలిపువ్వు బ్రహ్మకు అనుకూలంగా అబద్ధపు సాక్ష్యం చెప్పిందట. అందుకని శివుడు మొగలిపువ్వును ఎట్టి పరిస్థితుల్లో పూజలో ఉపయోగించవద్దు అని శపించినట్లు శివరాత్రి కథలో చెబుతారు. మొగలిపువ్వులపై పాములు సంచరిస్తాయి అని కూడా అంటారు. అయితే వీటిని అలంకరణలో వినియోగిస్తారు. బంతిపువ్వులను కూడా గుమ్మాలకు కడతారు. గరిక, చామంతులను కూడా భగవంతుడి పూజకు చేసే అలంకరణ సమయాల్లో మాత్రమే వినియోగించాలట. ఒక్కోసారి పూజకు పువ్వులు దొరకనపుడు లేదంటే పువ్వులు తక్కువగా ఉన్నప్పుడు చాలామంది పువ్వులను తుంచి ఆ రేకులతో పూజ చేస్తుంటారు. అలా అస్సలు చేయకూడదట. అలా చేస్తే భార్యాభర్తల మధ్య వియోగం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది.