భారత యువ రెజ్లర్ అంతిమ్ పంగల్ కొత్త చరిత్ర లిఖించింది. ప్రతిష్ఠాత్మక అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో సారి పసిడి పతకం గెలిచిన తొలి భారత రెజ్లర్‌గా అరుదైన ఘనత సొంతం చేసుకుంది.శుక్రవారం జరిగిన మహిళల 53కిలోల తుదిపోరులో అంతిమ్ 4-0తో మారియా యెఫ్రోమోవా(ఉక్రెయిన్)పై అద్భుత విజయం సాధించింది. మరోవైపు సవిత కూడా స్వర్ణం సొంతం చేసుకోగా, భారత మహిళల జట్టు టీమ్ చాంపియన్‌షిప్‌ను దక్కించుకుంది.