Politics

లోకేష్ పాదయాత్రలో మరో మైలురాయి

లోకేష్ పాదయాత్రలో మరో మైలురాయి

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 2500 మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో లోకేశ్‌ శిలాఫలకం ఆవిష్కరించారు. తెదేపా అధికారంలోకి వస్తే, ఏం చేస్తుందనే హామీలతో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అసైన్డ్, కొండ, వాగు, రైల్వే, ఇతర భూముల్లో పేదల ఇళ్లను క్రమబద్ధీకరించి పట్టాలు అందజేస్తానని హామీ ఇస్తూ శిలాఫలకం ఏర్పాటు చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్లు లేని నిరుపేదలకు 20 ఇళ్లు నిర్మిస్తాననే హామీతో లోకేశ్‌ శిలాఫలకం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేశ్‌ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది.