DailyDose

వెలుగులోకి వచ్చిన మేకుల బాబా బండారం-TNI నేటి నేర వార్తలు

వెలుగులోకి వచ్చిన మేకుల బాబా బండారం-TNI నేటి నేర వార్తలు

వెలుగులోకి వచ్చిన మేకుల బాబా బండారం

నమ్మినవారిని నట్టేట ముంచుతున్నారు కొందరు దొంగబాబాలు. జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా.. మేకుల బాబా తెరపైకి వచ్చాడు.. మేకుల బాబా అంటే.. మేకులు కొడితే దోషం పోతుందని నమ్మించే బాబా అన్నమాట.. మేకులు కొడితే దోషం పోతుందంటూ నమ్మించి మోసం చేసిన బురిడీ బాబా బాగోతం బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. నకిలీ బాబా మోసం ఘటన తాజాగా విజయవాడలో కలకలం రేపింది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన సుంకర రజనీ మచిలీపట్నం ఇనకుదురులో 14 సెంట్ల స్థలం కొనుగోలు చేసింది. తిరిగి అమ్ముడు పోలేదు. ఈ క్రమంలో ఓ మహిళ మౌలాల అనే బాబాను రజనీకి పరిచయం చేసింది. స్థలం అమ్ముడు పోవాలంటే స్థలంలో మేకులు కొట్టాలని చెప్పి రూ.2.5 లక్షలు తీసుకుని 4 మేకులు పాతాడు. 100 గంజాలు అమ్ముడుపోయేలా చేసి 4 లక్షలు ఇవ్వకపోతే శాపం తగులుతుందని బెదిరించాడు. వెధింపులు పెరగడంతో ఆమె చివరకు పోలీసులను ఆశ్రయించింది.రజనీ మచిలీపట్నం ఇనకుదురులో 14 సెంట్ల స్థలాన్ని 35 లక్షల రూపాయలతో కొనుగోలు చేసింది. అంత డబ్బు పెట్టి కొన్న స్థలం అమ్ముడవ్వకపోవడంతో మౌలాల అనే దొంగ బాబాను ఓ భక్తురాలు రజనీకి పరిచయం చేసింది. స్థలం అమ్ముడు పోవాలంటే స్థలంలో నలుదిక్కులా నాలుగు మేకులు కొట్టాలంటూ మౌలాల సూచించాడు. రెండున్నర లక్షలు తీసుకుని పూజలు చేసి నాలుగు మేకులు పాతి పెట్టిన మౌలాల.. నమ్మకం కుదిరేందుకు 100 గజాలు అమ్మించాడు. స్థలం అమ్మిన తర్వాత నాలుగు లక్షలు కమీషన్ ఇవ్వకపోతే శాపం తగులుతుందని భయపెట్టడం మొదలుపెట్టాడు. మోసపోయామని గుర్తించిన బాధితురాలు రజనీ.. ఇనకుదురు పోలీసులను ఆశ్రయించింది.దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెకుల బాబా.. నమ్మించి మోసం చేసిన ఘటన ఇప్పుడు బెజవాడ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. తన దగ్గర రూ.రెండున్నర లక్షల వరకు తీసుకుని బాబా పూజలు చేసినట్లు బాధితురాలు పేర్కొంటోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. వేగంగా ఎదురుగావస్తున్న లారీని బైక్ ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. అర్థరాత్రి సమయంలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులు కొనకనమిట్ల మండలం అంబాపురం గ్రామానికి చెందిన వినోద్, నాని, వీరేంద్రగా గుర్తించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

*   విజయవాడలో ఓ విషాద సంఘటన

విజయవాడలో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. పెళ్లైన మూడు నెలలకే నవ వధువు అత్తారింట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఏ కష్టం వచ్చిందో ఏమో తెలీదు కానీ, ఉరి వేసుకొని సూసైడ్ చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మూడు నెలల క్రితం నున్నలో ఉండే సురేష్ కుమార్‌కి హేమతేజతో వివాహం అయ్యింది. ఆషాడం కావడంతో పెళ్లైన కొన్ని రోజులకే పుట్టింటికి వెళ్లింది. ఆషాడం తర్వాత తిరిగి అత్తారింటికి వెళ్లింది. ఏమైందో ఏమో తెలీదు కానీ.. అత్తింటికి వెళ్లాక హేమతేజ ఆత్మహత్య చేసుకుంది. దీంతో.. అత్తారింటోళ్లు షాక్‌కు గురయ్యారు. వెంటనే హేమతేజ కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందజేశారు. దీంతో.. వాళ్లు వెంటనే అత్తారింటికి చేరుకున్నారు. తమ కుమార్తె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో శోకసంద్రంలో మునిగారు. మరోవైపు.. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.అత్తారింట్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా? అంటే.. పెళ్లైన వెంటనే ఆషాడం రావడంతో హేమతేజ పుట్టింట్లోనే ఉండిపోయింది. ఆషాడం ముగిశాకే అత్తారింటికి వచ్చింది. అత్తింటికి రాగానే ఇలా ఆత్మహత్యకు పాల్పడటంతో.. హేమతేజ సూసైడ్ మిస్టరీగా మారింది. అత్తారింట్లో ఏమైనా జరిగిందా? లేకపోతే హేమతేజ సూసైడ్‌కి ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. పెళ్లైన మూడు నెలలకే నవ వధువు చనిపోవడంతో.. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది.

హైదరాబాద్ లో మరో బెగ్గింగ్ మాఫియా

వృద్ధులతో భిక్షాటన చేయిస్తు బెగ్గింగ్ మాఫియా నడిపిస్తున్న అనిల్ పవార్ అనే వ్యక్తిని పోలీసులు శుక్రవారం (ఆగస్టు 18,2023)న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పలు ప్రాంతాల నుంచి వృద్ధులకు తీసుకొచ్చి ఒక్కొక్కరికి రూ.200లు ఇచ్చి హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భిక్షాటన చేయించి బెగ్గింగ్ మాఫియా చేస్తున్న అనిల్ పవార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ఇటువంటి దందాలు నగరంలో జరుగుతున్నాయా? అనే కోణంలో నిఘా పెట్టిన పోలీసులకు విస్తుగొలిపే విషయాలు వెల్లడవుతున్నాయి. పోలీసులు దర్యాప్తులో హైదరాబాద్ నగరంలో బెగ్గింగ్ మాఫియా ఆడగాలు ఒక్కొక్కటి బయటపడుతున్నారు.దీంట్లో భాగంగానే బెగ్గింగ్ మాఫియా నిర్వాహకుడు అనిల్ పవార్ ను అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే మరో బెగ్గింగ్ మాఫియా గుట్టును బటయపెట్టారు టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు. బీహార్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన కొంతమంది ముఠాగా ఏర్పడి ట్రాన్స్ జెండర్ల వేషాట్లో బెగ్గింగ్ లకు దిగుతున్నారని గుర్తించారు. సికింద్రాబాద్,ప్యారడైజ్,బూబ్లీబస్ స్టేషన్ వంటి పలు ప్రాంతాల్లో ట్రాన్స్ జెండర్ల వేషాలతో డబ్బులు వసూళ్లు చేస్తున్న 15మందిని అరెస్ట్ చేశారు. వీరితో పాటు బెగ్గింగ్ ముఠాకు చెందిన మరో ఐదుగురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు.ట్రాన్స్ జెండర్ల వేషాలతో బీహార్ నుంచి వచ్చిన కొంతమంది ముఠాలుగా ఏర్పడి బెగ్గింగ్ లకు పాల్పడుతున్న జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని..అడిగినంత ఇవ్వాలని డిమాండ్ చేస్తు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు తెలిపారు.

భార్యపై చాకుతో దాడి చేసిన భర్త

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆకివీడులో భార్య సంధ్యారాణిపై భర్త రాంబాబు చాకుతో దాడి చేసి హత్య చేశాడు. మెడ భాగంలో చాకుతో పొడవడంతో తీవ్ర రక్తస్రావంతో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ కారణంగానే భార్యపై భర్త రాంబాబు దాడి చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు రాంబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టపగలే హత్యా ఉదంతంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.

ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌లో తప్పిన ప్రమాదం

 కర్ణాటకలోని బెంగళూరులో  పెను ప్రమాదం తప్పింది. బెంగళూరులోని సంగోలి రాయన్న రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న ఓ రైలులో ఒక్కసారిగా మంటలు (Fire accident) చెలరేగాయి. ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌ శనివారం ఉదయం 5.45 గంటలకు చేరుకున్నది. ప్రయాణికులంతా దిగిన తర్వాత ప్లాట్‌ఫామ్‌ రైలును నిలిపిఉంచారు. అయితే ఉదయం 7.10 గంటలకు రైలులోని బీ1, బీ2 బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్టేషన్‌లో పొగలు దట్టంగా అలముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. రైలులో ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.కాగా, ఉదయం 7.10 గంటలకు ప్రమాదం జరిగితే.. అగ్నిమాపక సిబ్బంది 7.35 గంటలకు చేరుకున్నారని స్థానికులు తెలిపారు. అప్పటికే రైలు బోగీలు మొత్తం కాలిపోయాయని చెప్పారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

పెద్దపల్లి జిల్లాలో బాలికపై కేసులో ట్విస్ట్‌

పెద్దపల్లి జిల్లాలో ఇటీవలే మధ్య ప్రదేశ్ కు చెందిన మైనర్ బాలికపై రేప్‌ జరిగినట్లు వార్తల వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మధ్య ప్రదేశ్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ మృతి పై ట్విస్ట్‌ చోటు చేసుకుంది. మధ్య ప్రదేశ్ మైనర్ బాలిక ది గ్యాంగ్ రేప్‌ కాదు ఆత్మహత్య అంటూ తాజాగా లీకులు ఇస్తున్నారు. ఈ తరుణంలోనే పోలీసులపై ఓ రాజకీయ నాయకుడి ఒత్తిడి ఉందంటూ ఆరోపణలు వస్తున్నాయి.పొలిటికల్ ఒత్తిడి వల్లే దర్యాప్తు పేరుతో తాత్సారం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ కేసుపై నాలుగు రోజులుగా పోలీసులు మౌనం వహిస్తున్నారు. నాలుగు రోజులుగా దర్యాప్తు పేరుతో కేసును పోలీసులు సాగదీస్తున్నారు. మరో వైపు దర్యాప్తు జరుగుతున్న కేసు లో లీకులు ఇస్తున్నారు పోలీసులు. దీంతో మధ్యప్రదేశ్ బాలిక మృతి కేసులో అసలు నిజం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

*  బీహార్‌లో దారుణ ఘటన

 బీహార్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భాగల్‌పూర్‌లోని ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధ దంపతులను హత్య చేసిన కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ మేరకు శుక్రవారం పోలీసులు సమాచారం అందించారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ నివాసి మహ్మద్ ఆజాద్‌గా గుర్తించారు. ఆ వ్యక్తి వృద్ధ దంపతులను రాడ్లు, ఇటుకలతో కొట్టి హత్య చేశాడు. అనంతరం మృతదేహాలను జాతీయ రహదారిపై సుమారు 500 మీటర్లు ఈడ్చుకెళ్లి చెత్తకుప్పలో పడేశాడు. నిందితుడిని ఫతేపూర్‌లో నివాసముంటున్న మహ్మద్ ఆజాద్‌గా గుర్తించారు.బాధితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ఎస్పీ తెలిపారు. పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్టు చేశారు నిందితుడు మృతదేహాలను నడిరోడ్డుపై ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు కూడా సీసీటీవీలో రికార్డయ్యాయి. నిందితుడు మానసికంగా సరిగా లేడని ఎస్పీ తెలిపారు. నిందితుడు సబౌర్‌లోని ఫతేపూర్ నివాసి మహ్మద్ ఆజాద్ రోడ్డు పక్కన కూర్చున్న ఓ వృద్ధుడి బట్టలను తాకగా.. వృద్ధుడు నిరాకరించడంతో ఇటుక, ఇనుప రాడ్‌తో కొట్టినట్లు తెలిసింది. కానీ పూర్తి వివరాలకు ఇంకా తెలియరాలేదు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో అతడు మృతదేహాలను లాగుతున్న దృశ్యాలు కూడా బయటపడ్డాయి. ఈ మొత్తం వ్యవహారంలో అతడిని ఎవరూ అడ్డుకోలేదు. ఈ కేసులో వృద్ధ దంపతులు హత్యకు గురయ్యారని ఎస్పీ అమిత్ రంజన్ తెలిపారు.

దోమల మందు బాటిల్ పేలడంతో నలుగురు మృతి

దోమల మందు బాటిల్ పేలడంతో ఊపిరి ఆడకుండా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ షాకింగ్‌ సంఘటన చెన్నైలోని మనాలీలో జరిగింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. ఇంట్లో ఉండే దోమల మందు బాటిల్ పేలడంతో ఊపిరి ఆడకుండా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.నిన్న రాత్రి ఇంట్లో దోమల కోసం కరెంట్ ప్లగ్‌ లో లిక్విడ్ బాటిల్ పెట్టారు. అయితే.. అదే సమయంలో.. షాక్ సర్య్కూట్ తో ఒక్కసారి దోమల మందు లిక్విడ్ బాటిల్ పేలిపోయింది. ఈ పేలుడు వల్ల స్విచ్ కింద ఉన్న బట్టలకు మంటలు అంటుకున్నాయి. దీంతో భారీగా మంటలు వ్యాపించాయి. లిక్వీడ్ సహా పొగ వల్ల ఊపిరి ఆడుకుండా నలుగురు చనిపోయారు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.

*  బిహార్‌లోని అరియా జిల్లాలో ఓ జర్నలిస్టు దారుణ హత్య

బిహార్‌లోని అరియా జిల్లాలో ఓ జర్నలిస్టు దారుణ హత్యకు పాల్పడ్డారు. ఓ హిందీ దినపత్రికకు పనిచేసే విమల్‌కుమార్‌ యాదవ్‌(35)ను గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అతడి ఇంటి వద్ద కాల్చి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రేమ్‌నగర్‌ గ్రామంలోని విమల్‌కుమార్‌ ఇంటి వద్దకు నిందితులు తెల్లవారుజామున 5.30 సమయంలో వచ్చి తలుపు తట్టారు. విమల్‌కుమార్‌ తలుపు తీయగానే తుపాకులతో విచక్షణారహితంగా కాల్చి పారిపోయారు. ఘటనా స్థలంలోనే విమల్‌ ప్రాణాలు కోల్పోయారు. పక్కింటి వ్యక్తితో విమల్‌కు పాత గొడవలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా నాలుగేళ్ల క్రితం అతడి సోదరుడు కూడా హత్యకు పాల్పడ్డాడని, విమల్ సాక్షిగా ఉన్న ఆ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతోందని తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేశారు ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ అధికారులను అదుపులోకి తీసుకున్నారు.