DailyDose

పాతిపెట్టిన శవపేటిక నుండి శబ్దాలు వస్తున్నాయని చెప్పిన కాటికాపరి

పాతిపెట్టిన శవపేటిక నుండి శబ్దాలు వస్తున్నాయని చెప్పిన కాటికాపరి

చనిపోయిన యువతిని పాతి పెట్టిన శవపేటి నుంచి ఒకటే శబ్దాలు వస్తున్నాయి. శవాన్ని పాతిపెట్టిన మరునాటి నుంచి పేటిక నుంచి శబ్దాలు రావటంతో కాటికాపరి ఆశ్చర్యపోయాడు. నిత్యం శవాల జీవనం సాగించే వ్యక్తి అయిన కాటికాపరికి మొదట్లో భయం వేయలేదు.కానీ పదే పదే శవపేటిక నుంచి శబ్దాలు రావటంతో భయపడ్డాడు. శవపేటికను తెరిచి చూసే ధైర్యం లేక..ఊరకుండిపోయాడు. అలా రెండు మూడు రోజులు శబ్దాలు అలాగే వస్తుండటంతో ఇక ఊరుకోలేకపోయాడు.

ఆ యువతి తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆమె వెంటనే తన బంధువులతో కలిసి వచ్చింది. శవపేటికను తవ్వి చూశారు. అంతే ఒక్కసారిగా అందరు ఆశ్చర్యపోయారు. మృతదేహాన్ని శవపేటికలో పెట్టి పూడ్చే సమయంలో ఎటువంటి గాయాలు లేవు..కానీ తవ్వి చూసేసరికి మృతదేహం నిండా గాయాలు. దేహంపై కప్పిన బట్ట అంతా రక్తసిక్తంగా ఉండి. ఆ పరిస్థితి చూసిన ఆమె తల్లి విలవిల్లాడిపోయింది. గుండెలు అవిసేలా ఏడ్చింది.

ఉత్తర బ్రెజిల్‌(Northern Brazil)లో ఈ ఘటన జరిగి దాదాపు ఐదేళ్లు జరిగింది. ఈ వార్త ఇటీవల సోషల్ మీడియాలో వైలర్ గా మారింది. 2018 జనవరిలో రోసంగేలా అల్మెడా (Rosangela Almeida)అనే 37 ఏళ్ల మహిళ సడెన్ గా గుండెపోటుకు (heart attack) గురైంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరిక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయిందని తెలిపారు. చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. దీంతో మృతదేహాన్ని అల్మెయిడాలోని శ్మశానవాటికలో శవ పేటికలో ఉంచి దహన సంస్కారాలు నిర్వహించారు. తరువాత ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోయారు.

కానీ ఆ మరునాటిరోజు నుంచే ఆ శవపేటిక నుంచి శబ్దాలురావటంతో కాటికాపరి ఆశ్చర్యపోయాడు. కానీ కాటికాపరి పెద్దగా పట్టించుకోలేదు.కానీ రోజూ ఇలాగే శబ్ధాలు వస్తుండడంతో శ్మశానంలో ప్రతీ సమాధి వద్దకు వెళ్లి పరిశీలించాడు. అలా 11 రోజుల తర్వాత చివరికి యువతిని పూడ్చి పెట్టిన స్థలం వద్ద నుంచే వస్తున్నాయని గుర్తించాడు. ఆశ్చర్యపోయాడు. కాస్త భయపడ్డాడు కూడా. అదే విషయాన్ని యువతి కుటుంబ సభ్యులకు చెప్పాడు.

విషయం విన్న వారుకూడా ఆశ్చర్యపోయారు. అంతా కలిసి వచ్చారు. పూడ్చిన శవ పేటికను బయటికి తీసి తెరిచారు. లోపల యువతి చేతులన్నీ రక్తంతో తడిసి ఉండడం చూసి షాక్ అయ్యారు. పూడ్చిన సమయంలో ఎలాంటి గాయాలూ లేని శరీరం.. తరువాత రక్తంతో తడిసి ఉండడం చూసి వారంతా ఆశ్చర్యపోయారు. ఏం జరిగిందో అర్థం కాక అయోమయానికి గురయ్యారు. చనిపోయిందని డాక్టర్లు చెప్పిన మాటలు నమ్మి అంత్యక్రియలు నిర్వహించే సమయానికి ఆమె ప్రాణాలతోనే ఉందని.. గుర్తించారు. శవ పేటికను తెరచుకుని బయటికి వచ్చేందుకు ఆమె ఎంతగానో ప్రయత్నించినట్లు గుర్తించారు.

అయితే దురదృష్టవశాత్తు బయటికి తీసిన సమయంలో యువతి ప్రాణాలతో లేదు. బ్రెజిల్ చట్టాల (Brazil Laws) ప్రకారం ఇది పెద్ద నేరం. దీనికి మూడేళ్ల పాటు జైలుశిక్ష పడే అవకాశాలున్నాయి. ఈ ఘటనపై సివిల్ అధికారులు రంగంలోకి దిగారు. కానీ యువతిని కావాలనే ఇలా చేయలేదని గుర్తించడంతో సమస్య సర్దుమణిగింది. పూడ్చిన సమయంలో గుర్తించి, బయటికి తీసి ఉంటే యువతి బతికి ఉండేదని అంతా కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.