Business

ట్రయల్స్ కోసం సిద్ధంగా ఉన్న తొలి హైడ్రోజన్ బస్సు-TNI నేటి వాణిజ్య వార్తలు

ట్రయల్స్ కోసం సిద్ధంగా ఉన్న తొలి హైడ్రోజన్ బస్సు-TNI నేటి వాణిజ్య వార్తలు

*  భారీగా పెరిగిన యాపిల్ ధరలు

దేశంలో యాపిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. యాపిల్ తోటలకు ప్రసిద్ధి చెందిన హిమాచల్ ప్రదేశ్లో కుండపోత వర్షాలు పడుతుండటంతో పంట నష్టం జరిగింది. యాపిల్ తోటలు నాశనం అయ్యాయి. దిగుబడి భారీగా తగ్గిపోయింది. మరోవైపు రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో ఢిల్లీకి వచ్చే యాపిల్స్ వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సాధారణంగా బాక్స్ యాపిల్స్ రూ.1000 వరకు ఉంటుంది. ఇప్పుడది రూ.2500 నుంచి రూ.3500 వరకు పలుకుతోంది.

భారీగా తగ్గిన బంగారం ధరలు

గత రెండు మూడు రోజుల నుంచి భారీగా తగ్గిన బంగారం ధరలు. నేడు స్థిరంగా నమోదు అయ్యాయి. ఈరోజు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59, 020 ఉండగా, అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54, 100 గా ప‌లుకుతుంది.

ట్రయల్స్ కోసం సిద్ధంగా ఉన్న హైడ్రోజన్ బస్సు

 విరివిగా వాడుతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయ ఇంధనాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అన్ని దేశాలూ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ కోరనే ఓ వైపు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్న కేంద్రం.. అటు హైడ్రోజన్‌తో నడిచే వాహనాలకూ పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా హైడ్రోజన్‌తో నడిచే బస్సు కమర్షియల్‌ ట్రయల్‌కు సిద్ధమైంది. సముద్రమట్టానికి అత్యంత ఎత్తులో ఉండే శీతల ప్రాంతమైన లద్దాఖ్ రోడ్లపై పరుగులు పెట్టేందుకు సన్నద్ధమైంది.హైడ్రోజన్ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రభుత్వరంగ విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీ (NTPC) అశోక్‌ లేల్యాండ్‌తో కలిసి ఈ బస్సులను రూపొందించింది. ఒక్కో బస్సు ఖరీదు రూ.2.5 కోట్లు. మొత్తం ఐదు బస్సులను లేహ్‌ అడ్మినిస్ట్రేషన్‌కు ఎన్టీపీసీ అప్పగిస్తోంది. ఇందులో భాగంగా తొలి బస్సు తాజాగా లేహ్‌ చేరుకుంది. ఈ బస్సుల కోసం లేహ్‌లో ఎన్టీపీసీ రీఫిల్లింగ్ స్టేషన్‌తో పాటు, గ్రీన్‌ హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ ఉత్పత్తికి 1.7 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేసింది. త్వరలో కమర్షియల్‌ ట్రయల్‌ ప్రారంభం కానున్నాయి.మూడు నెలల పాటు ఈ ట్రయల్ నిర్వహించబడుతుంది. సాధారణ బస్సుల మాదిరిగానే ఈ బస్సులోనూ టికెట్ ధరలు వసూలు చేస్తారు. హైడ్రోజన్ బస్సుల నడిపే నష్టాలు వాటిల్లితే ఎన్టీపీసీనే భరించనుంది. వాస్తవానికి ఆగస్టు 15న ఈ సేవలు ప్రారంభం కావాల్సి వర్షాలు, కొండచరియలు విరిగిపడడం వంటి ఘటనల కారణంగా వాయిదా పడింది. ఈ తరహా టెక్నాలజీతో వస్తున్న తొలి బస్సు మాత్రమే కాకుండా.. సముద్రమట్టానికి దాదాపు 11,500 అడుగుల ఎత్తులో ఈ బస్సును పరీక్షించడం ప్రత్యేకత.

ఆర్బీఐ కొత్త నిబంధనలు

ఈ విధంగా రేట్లు పెరగడం కారణంగా రుణాలు తీసుకున్న వారికి భారం మరింతగా పెరిగే అవకాశం ఉంది. అయితే తాజాగా రుణాలు మరింత ఖరీదైనవి కానున్నాయి. రుణ ఈఎంఐకి సంబంధించి ఇటీవల ఆర్‌బీఐ కొత్త గైడ్‌లైన్‌ను విడుదల చేసింది. కొత్త రూల్‌లో కొన్నిచోట్ల వినియోగదారులకు ఉపశమనం లభించగా, కొందరు ఆందోళన చెందుతున్నారు. ఆర్‌బీఐ కొత్త నిబంధన కారణంగా బ్యాంకులు, రుణ సంస్థలు ఎన్‌బీఎఫ్‌సీ రుణాల వాయిదాను పెంచాల్సి రావచ్చు. సరళంగా..బ్యాంకుల రుణాల విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వివిధ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో మార్పు చేర్పులు చేస్తుంటుంది. పలు బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లపై వడ్డీ రేట్లు తగ్గించడం, అలాగే ఇతర రుణాలు అంటే వ్యక్తిగత, హోమ్‌ లోన్‌, వాహనాలకు సంబంధించిన రుణాల వడ్డీ రేట్లు పెంచేస్తున్నాయి. ఈ విధంగా రేట్లు పెరగడం కారణంగా రుణాలు తీసుకున్న వారికి భారం మరింతగా పెరిగే అవకాశం ఉంది.అయితే తాజాగా రుణాలు మరింత ఖరీదైనవి కానున్నాయి. రుణ ఈఎంఐకి సంబంధించి ఇటీవల ఆర్‌బీఐ కొత్త గైడ్‌లైన్‌ను విడుదల చేసింది. కొత్త రూల్‌లో కొన్నిచోట్ల వినియోగదారులకు ఉపశమనం లభించగా, కొందరు ఆందోళన చెందుతున్నారు. ఆర్‌బీఐ కొత్త నిబంధన కారణంగా బ్యాంకులు, రుణ సంస్థలు ఎన్‌బీఎఫ్‌సీ రుణాల వాయిదాను పెంచాల్సి రావచ్చు. సరళంగా చెప్పాలంటే.. మీ ఈఎంఐ భారం పెరగవచ్చు. ఆర్‌బీఐ నిర్ణయంతో రుణాలు తీసుకునే వారి సంఖ్య తగ్గే అవకాశం ఉందని బ్యాంకింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం.. వడ్డీ రేటులో మార్పు ఉంటే రుణగ్రహీతలు ఫిక్స్‌డ్ రేటు రుణాలకు మారే అవకాశం ఇవ్వబడుతుంది. దీని కారణంగా బ్యాంకులు తిరిగి చెల్లింపు సామర్థ్యాన్ని ప్రస్తుత రేటు కంటే ఎక్కువ రేటుతో లెక్కిస్తాయి. రుణగ్రహీతలకు రుణ మొత్తం తగ్గవచ్చు. అయితే ప్రస్తుత రుణ గ్రహీతలకు డిసెంబర్ 31 నుంచి ఆర్‌బీఐ కొత్త నిబంధనను అమలు చేయనుంది.రుణంపై వడ్డీ రేటు వేగంగా పెరుగుతూ ఉంటే రుణంపై నెలవారీ వడ్డీకి ఈఎంఐ కొనసాగుతుందని బ్యాంకులు నిర్ధారించుకోవాలి. ఇది ఇన్‌స్టాల్‌మెంట్‌పై ప్రభావం చూపకూడదు. ఆ తర్వాత బకాయి మొత్తం పెరగకూడదు. లోన్ అప్రూవల్ లెటర్‌లో, ఫ్లోటింగ్ నుంచి ఫిక్స్‌డ్ రేట్‌కి వెళ్లడానికి ఎంత ఛార్జీ విధించబడుతుందో వెల్లడించాల్సి ఉంటుంది. ప్రస్తుతం, బ్యాంకులు వడ్డీ రేట్ల ఆధారంగా రుణగ్రహీత రుణం తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని లెక్కిస్తాయి.మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు, హెచ్‌ఎఫ్‌సిలు మాత్రమే స్థిర వడ్డీపై గృహ రుణాలను అందిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని బ్యాంకులు హైబ్రిడ్ వడ్డీ రేటుతో హోమ్ లోన్ కస్టమర్లకు ఆఫర్ చేస్తున్నాయి. పదవీకాలం పెరుగుదలతో రుణం వడ్డీ రేటు ప్రమాదం పెరుగుతుంది. దీని కారణంగా బ్యాంకులు స్థిర రేటు గృహ రుణాలకు ఎక్కువ వడ్డీని వసూలు చేస్తాయి. ఐసిఐసిఐ బ్యాంక్‌లో ఫ్లోటింగ్ రేటు తొమ్మిది నుంచి 10.5 శాతం ఉండగా, స్థిర రేటు 11.2 నుంచి 11.5 శాతంగా మీరు దీన్ని అర్థం చేసుకోవచ్చు.

మెటా ఉద్యోగులకు హెచ్చరిక

 ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ ‘మెటా’ తన ఉద్యోగులకు తాజాగా సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ప్రతీ వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాలన్న నిబంధనలను పాటించని వారు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు మెటా మానవ వనరుల అధిపతి లోరీ గోలెర్‌ (Lori Goler) ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు.బిజినెస్‌ ఇన్‌సైడర్‌ రిపోర్ట్‌  ప్రకారం.. సెప్టెంబర్‌ 5 నుంచి కార్యాలయాలకు కేటాయించిన ఉద్యోగులు వారానికి మూడు రోజులు కచ్చితంగా రావాల్సిందేనని స్పష్టం చేశారు. సంస్థ లక్ష్యం ఉద్యోగుల మధ్య మంచి అనుబంధం, బలమైన టీమ్‌ వర్క్‌ను ప్రోత్సహించడమే అని నోటీసుల్లో పేర్కొన్నారు. ఉద్యోగులు సంస్థ సూచనలను పాటిస్తున్నారా..? లేదా..? అన్నది మేనేజర్లు తనిఖీ చేయాలని ఆదేశించారు. నిబంధనలను పాటించనివారిపై స్థానిక చట్టాల కింద తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తరచూ నిబంధనలను ఉల్లంఘించే వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని తెలిపారు. ఇందులో ఉద్యోగుల పనితీరు రేటింగ్‌ను తగ్గించడం, సమస్య అలాగే కొనసాగితే ఉద్యోగం నుంచి తొలగించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

భారత్‎లో ఈ మెడిసిన్ ఖరీదు

స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA) ఔషధం భారతదేశంలో చాలా ఎక్కువ ధరకు అమ్మబడుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా కంపెనీ రోచె ఈ ఔషధాన్ని తయారు చేస్తోంది. ఈ కంపెనీ ఔషధం ఒక సీసా ధర భారతదేశంలో రూ. 6.2 లక్షలు. ఇది చైనా, పాకిస్థాన్‌ల కంటే 15 రెట్లు ఎక్కువ. ఇక్కడ కంపెనీ ఈ ఔషధం సీసాను చైనాలో రూ. 44,692, పాకిస్థాన్‌లో రూ. 41,002కు విక్రయిస్తోంది. SMA ఒక ప్రాణాంతకమైన నాడీ కండరాల, ప్రగతిశీల జన్యు వ్యాధిగా పిలువబడుతుంది. ఈ వ్యాధి మెదడు, వెన్నుపాము నాడీ కణాలను దెబ్బతీస్తుంది. ఈ కారణంగా ఈ వ్యాధిలో రోగి క్రమం తప్పకుండా మందులు తీసుకోవాలి. ఇది కాకుండా 20 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్న రోగి సంవత్సరానికి ఈ ఔషధాన్ని 36 సీసాలు తీసుకోవాలి. స్విస్ కంపెనీ రోచె ఈ మందును రెండేళ్ల క్రితం 2021లో భారత్‌లో విడుదల చేసింది. అయితే తొలిసారిగా మందుల ధరలో ఇంత భారీ వ్యత్యాసం కనిపించింది.ఢిల్లీ హైకోర్టులో కొనసాగుతున్న ఒక కేసులో సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ మాట్లాడుతూ.. చైనా, పాకిస్తాన్‌ల కంటే భారతదేశంలో ఈ ఔషధం దాదాపు 10 శాతం ఎక్కువ ధరకు అమ్ముడవుతోంది. ఎఫ్‌ఎస్‌ఎంఎ ఇండియా ఛారిటబుల్ ట్రస్ట్ ఎస్‌ఎంఎ వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు సరసమైన ధరలో ఈ ఔషధాన్ని అందుబాటులో ఉంచాలని పిటిషన్ దాఖలు చేసింది.SMA వ్యాధితో బాధపడుతున్న వ్యక్తుల కుటుంబ సభ్యులు కలిసి ఈ ట్రస్ట్‌ను రూపొందించారు. భారతదేశంలో ఈ వ్యాధికి మందుల ధర చాలా ఎక్కువ. ఇది సామాన్యులకు అందనిది. 2017లో తొలిసారిగా ఈ వ్యాధితో బాధపడుతున్న రోగుల బృందం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత కూడా అందులో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆ తర్వాత సెప్టెంబర్ 2019లో క్యూర్ SMA ఫౌండేషన్ ద్వారా ఈ విషయం విచారణను వేగవంతం చేయడానికి ఒక జోక్యం పిటిషన్ దాఖలు చేయబడింది.SMA ఫౌండేషన్‌లో 1000 మందికి పైగా రోగులు నమోదు చేసుకున్నారు. హ్యుమానిటేరియన్ యాక్సెస్ లేదా కారుణ్య వినియోగ కార్యక్రమం కింద కేవలం 300 మంది రోగులకు మాత్రమే ఉచిత మందులు ఇవ్వబడుతున్నాయి. మొత్తం ప్రపంచంలో SMA వ్యాధి చికిత్స కోసం కేవలం మూడు మందులు మాత్రమే ఆమోదించబడిందని చెప్పబడింది. ఈ మందులను బయోజెన్, నోవార్టిస్, రోచె కంపెనీలలో తయారు చేస్తారు. ఇది కాకుండా 2021 సంవత్సరంలో రోచె కంపెనీ భారతదేశంలో Evrysdi ఔషధాన్ని విడుదల చేసింది.

రైల్వే ప్రయాణికులకి గమనిక

రైలు ప్రయాణం చాలా సౌకర్యంగా ఉంటుంది అలాగే తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయణించవచ్చు. అయితే రైలు టికెట్‌ తీసుకునే సమయంలో చిన్న పొరపాటు వల్ల పెద్ద నష్టాన్ని భరించవలసి ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణమైనా, తక్కువ దూర ప్రయాణమైనా కచ్చితంగా టికెట్‌ తీసుకోవాలి. అయితే రైలు టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడు లేదా కౌంటర్‌లో టికెట్‌ తీసుకునేటప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. కొంతమంది టికెట్‌ని ఆన్‌లైన్‌ ద్వారా బుక్ చేసుకుంటారు మరికొంత మంది స్టేషన్‌లో టికెట్‌ కౌంటర్‌ ద్వారా తీసుకుంటారు. అయితే రైలు టిక్కెట్‌లో చాలా సమాచారం ఉంటుంది. టికెట్ కొనుగోలు చేసే వ్యక్తి ఈ సమాచారాన్ని సరిగ్గా గమనించాలి. దానిపై గమ్యస్థానం పేరు ఖచ్చితంగా ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ ఉంటే అది మీరు వెళ్లే గమ్యస్థానమేనా లేదా నిర్ధారించుకోవాలి. లేదంటే చాలా డబ్బులు నష్టపోతారు. టికెట్ కొనుగోలు చేసిన తర్వాత గమ్యస్థాన స్టేషన్ పేరును ఎల్లప్పుడూ తనిఖీ చేయాలి. రైల్వే కౌంటర్ నుంచి టికెట్ తీసుకున్నప్పుడు కొన్నిసార్లు హడావుడిగా మరికొన్నిసార్లు మానవ తప్పిదం వల్ల స్టేషన్ పేరు తప్పుగా పడవచ్చు. దీనివల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. ఉదాహరణకు దేశ రాజధాని ఢిల్లీలోనే అనేక రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ఢిల్లీ, న్యూఢిల్లీ, ఢిల్లీ కాంట్, ఢిల్లీ సరైరోహిల్లా, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి. మీరు టిక్కెట్ కౌంటర్‌లో ఢిల్లీలోని ఏదైనా స్టేషన్‌కి టికెట్‌ అడిగితే వారు హడావిడిలో ఢిల్లీ స్టేషన్‌కి మాత్రమే టికెట్‌ ఇస్తారు. దీనివల్ల మీరు దిగాల్సిన స్టేషన్‌ వరకు టికెట్‌ పనిచేయదు. ఇదికాకుండా కొన్నిసార్లు వేరే స్టేషన్‌కు టికెట్‌ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే రైల్వే టిక్కెట్ తీసుకునేటప్పుడు రైల్వే స్టేషన్ పూర్తి పేరు చెప్పాలి. ఆపై టికెట్ తీసుకోవాలి. కౌంటర్‌ వద్ద ఉండే గందరగోళం వల్ల మీరు ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే టికెట్‌ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రయాణంలో టీసీ వల్ల ఇబ్బందిపడుతారు. అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌

నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తో రెండు ప్రీ-పెయిడ్‌ మొబైల్‌ ప్లాన్లను రిలయన్స్‌ జియో శుక్రవారం అందుబాటులోకి తెచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఈ రకమైన భాగస్వామ్యం ప్రీ-పెయిడ్‌ కేటగిరీలో ఇదే తొలిదని ఈ సందర్భంగా సంస్థ తెలియజేసింది. ‘మా వినియోగదారులకు ప్రపంచ శ్రేణి సర్వీసులను అందివ్వడానికి మేము కట్టుబడి ఉన్నాం. అందులో భాగంగానే మా ప్రీ-పెయిడ్‌ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్‌ బండిల్స్‌ను ప్రారంభిస్తున్నాం’ అని జియో ప్లాట్‌ఫామ్స్‌ సీఈవో కిరణ్‌ థామస్‌ ఈ సందర్భంగా ఓ ప్రకటనలో తెలిపారు. నిజానికి ఇప్పటికే జియో పోస్ట్‌-పెయిడ్‌ ప్లాన్‌, జియో ఫైబర్‌ ప్లాన్ల ఎంపికపై వినియోగదారులకు నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తున్నది. అయితే ప్రీ-పెయిడ్‌ యూజర్లకు మాత్రం లేదు. తాజా ఆఫర్‌తో ప్రీ-పెయిడ్‌ కస్టమర్లకూ నెట్‌ఫ్లిక్స్‌ వినోదం అందుతున్నది. తమ ఈ ప్లాన్లతో 40 కోట్లకుపైగా జియో ప్రీ-పెయిడ్‌ కస్టమర్లకు నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ దొరుకుతుందని కంపెనీ చెప్పింది.84 రోజుల వ్యవధితో జియో ప్రీ-పెయిడ్‌ నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్లు.రూ.1,099, రూ.1,499 ధరల్లో లభ్యం,రూ.1,099 ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌, అన్‌లిమిటెడ్‌ 5జీ డాటా లేదా రోజుకు 2జీబీ 4జీ డాటా, అపరిమిత వాయిస్‌ కాల్స్‌ ఉంటాయిరూ.1,499 ప్లాన్‌లో కస్టమర్లు నెట్‌ఫ్లిక్స్‌ను ఒకేసారి అటు మొబైల్‌లో ఇటు టీవీల్లో చూడవచ్చు. అన్‌లిమిటెడ్‌ 5జీ డాటా లేదా 3జీబీ 4జీ డాటా, అపరిమిత వాయిస్‌ కాల్స్‌ ఉంటాయి.నెట్‌ఫ్లిక్స్‌ కంటెంట్‌ను మొబైల్‌ ఫోన్లలో మాత్రమే చూసేలా విడిగా రూ.149తో నెలవారీ నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ ప్లాన్‌,విడిగా రూ.199 రిచార్జ్‌తో నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ నెలవారీ ప్లాన్‌,84 రోజుల కాలపరిమితితో అపరిమిత వాయిస్‌ కాల్స్‌ 2జీబీ డాటా ప్లాన్‌ ధర రూ.719, 3జీబీ డాటాతో రూ.999

*  నేడు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి కాస్త ఊరటనిచ్చినప్పటికీ.. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ రేట్లలో ఎలాంటి మార్పులు జరగలేదు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.హైదరాబాద్: రూ. 1,155,వరంగల్: రూ. 1,174,విశాఖపట్నం: రూ. 1,112,విజయవాడ: రూ. 1,118,గుంటూర్: రూ. 1,114