కాలి నడక భక్తులకు భద్రత కల్పిస్తామని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ప్రకటన చేశారు. భక్తులపై వన్యమృగాల దాడులను నివారించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిసి టీవీల ఏర్పాటుతోపాటు ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని విజయసాయిరెడ్డి తెలిపారు.శ్రీవారి ఆతృకుల భద్రతకు టీటీడీ పాలకమండలి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని వెల్లడించారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రకటించారు. తిరుమలకు వచ్చే భక్తులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. భక్తుల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఇక అటు ‘భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి’ అనేది వ్యాపార ప్రకటన. కొత్తగా బాబా అవతారం ఎత్తిన చంద్రబాబు గారు కూడా ప్రజలు తమ బాధలు తనకు చెప్పుకుంటే దేవుడికి విన్నవించుకున్నట్టే అని ‘సంకల్పాల’ గురించి మాట్లాడుతున్నాడు. ప్రజల మీద కోపంతో రాఖీలకు తాంత్రిక పూజలు చేసి పంపిస్తారా ఏంటి…బాబు గారూ? అంటూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.