ఉల్లి ఎగుమతులపై కేంద్రం 40శాతం సుంకం విధించిన నేపథ్యంలో రైతులు నిరసనకు దిగారు. మహారాష్ట్రలోని (మహారాష్ట్ర) అహ్మద్‌నగర్ హోల్‌సెల్ మార్కెట్లో ఉల్లి వేలంపాటను తాత్కాలికంగా నిలిపివేశారు. రైతుల శ్రేయస్సుపై కేంద్రం వైఖరి మరోసారి బయటపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ”కేంద్రం రైతు వ్యతిరేక విధానాలు మరోసారి బయటపడ్డాయి. ఉల్లిని అధికమొత్తంలో ఎగుమతి చేయడం ద్వారా కొద్దోగొప్పో లాభాలు పొందొచ్చని భావించాం. కానీ, మా ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ఎగుమతులపై 40 శాతం సుంకం విధించింది. దీంతో దేశీయ విపణిలో ఉల్లి ధరలు పడిపోయాయి, మాకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది.” అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహరాష్ట్రలో తగినంత వర్షపాతం లేనందున మార్కెట్‌లోకి కొత్త ఊళ్లు రావడం ఇప్పటికే ఆలస్యం కాగా, తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మరింత నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. వస్తువులను దృష్టిలో ఉంచుకొని కేంద్రం రైతులకు అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ హోల్‌సేల్ మార్కెట్లలో ధర్నాలు నిర్వహించామని స్వాభిమాని షేట్కారీ సంఘటన రాష్ట్ర అధ్యక్షుడు జగ్‌పత్ తెలిపారు.
కొత్తగా విధించిన 40 శాతం సుంకం 2023 డిసెంబరు 31 వరకు అమల్లో ఉంటుందని శనివారం కేంద్ర ఆర్థికశాఖ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఉల్లి ధరలు సెప్టెంబరులో పెరిగే అవకాశం ఉందని నివేదికలు వస్తున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 4 వరకు 9.75 లక్షల టన్నుల ఉల్లి మన దేశం నుంచి ఎగుమతి అయ్యింది. రాబోయే పండుగల సీజన్‌లో గిరాకీ పెరుగుతుంది కాబట్టి దేశీయంగా లభ్యత పెంచేందుకే ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై సుంకం విధించినట్లు మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ మరోవైపు ప్రభుత్వం 3 లక్షల టన్నులు ఈ ఏడాదికి బంగా ఉంచింది.