Devotional

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం

తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్..సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి 13 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. ఇక టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 06 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 79,242 మంది భక్తులు కాగా..36,039 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ. 4.76 కోట్లు గా నమోదు అయింది.కాగా, తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఈ నెల 24న రూ.300ల టికెట్లు విడుదల కానున్నాయి. ఆన్ లైన్ లో నవంబర్ మాసం టికెట్ల విడుదల షెడ్యూల్ విడుదల చేసింది టిటిడి. లక్కిడిఫ్ విధానంలో పోందే ఆర్జిత సేవా టికెట్ల కోసం రేపు ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ఎల్లుండి ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఉంజల్ సేవా, సహస్రదీపాలంకరణ సేవా టికెట్ల విడుదల చేయనున్నారు.