అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నూతన కాన్సులేట్ జనరల్‌గా మరో తెలుగు వ్యక్తి నియమితులయ్యారు. భారత్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్‌లో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న డాక్టర్ శ్రీకర్ కె రెడ్డి (IFS) నూతన కాన్సులేట్ జనరల్(CGI)గా నియమితులయ్యారు. యాదాద్రి జిల్లాలోని మోత్కూరు మండలంలోని కొండగడప గ్రామంలో జన్మించిన డాక్టర్ శ్రీకర్ కె రెడ్డి 1996లో కాకతీయ వర్సిటీ వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికై తన బ్యాచ్‌లోనే సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. జర్మనీలోని బెర్లిన్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయంలో పనిచేసిన ఆయన.. దిల్లీలోని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలోనూ సేవలందించారు. గతంలో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన డాక్టర్ టి.వి.నాగేంద్ర ప్రసాద్ తర్వాత మరో తెలుగు వ్యక్తి ఆ పదవి చేపట్టడం తెలుగువారికి గర్వకారణమని పలువురు ఎన్నారైలు పేర్కొన్నారు.
SFO భారత కాన్సుల్ జనరల్‌గా డా.శ్రీకర్ రెడ్డి
Related tags :