వింటేజ్ కార్ల (వింటేజ్ కార్లు)కు విశేష ఆదరణ ఉంటుంది. వేలం నిర్వహణలో అవి రికార్డు ధర పలుకుతుంటాయి. కానీ, టైం ఊడిపోయి.. ఎక్కడికక్కడ కాలిపోయి.. తుక్కుగా మారిన ఓ రేస్ కారు ఏకంగా రూ.15 కోట్ల (1.87 మిలియన్ డాలర్లు)కు పైగా ధర పలకడం విశేషం. అమెరికా (అమెరికా)లోని కాలిఫోర్నియాలో ‘ఆర్‌ఎం సోథెబీ’ సంస్థ నిర్వహించిన వేలంలో ఓ వ్యక్తి ఈ ‘ఫెరారీ 500 మాండియల్ స్పైడర్ సిరీస్ 1’ మోడల్ కారును భారీ ధరకు సొంతం చేసుకుంది. 1960లో ఓ రేసులో ఇది ప్రమాదానికి గురై మంటల్లో చిక్కుకుంది.
ఇటాలియన్ రేసింగ్ డ్రైవర్ అల్బెర్టో అస్కరీ.. 1952, 53లో వరుసగా ‘ఫార్ములా వన్ వరల్డ్ డ్రైవర్స్ ఛాంపియన్‌షిప్’ విజయాలకు గుర్తుగా ఫెరారీ సంస్థ ఈ రేస్ కారును తయారు చేసింది. ప్రఖ్యాత ఇటాలియన్ డిజైన్ సంస్థ ‘పినిన్ ఫరీనా’ దీని బాడీ రూపొందించబడింది. ఫెరారీకి మొట్టమొదటి రేసింగ్ విజయాన్ని అందించిన డ్రైవర్ ఫ్రాంకో కోర్టేస్.. 1954లో ఈ కారును కొనుగోలు చేశారు. అనంతరం 1958లో ఇది అమెరికాకు తరలిపోయింది.అయితే, 1960లో ఓ రేసులో ప్రమాదానికి గురైన ఈ కారు మంటల్లో కాలిపోయింది. 1978 వరకు చేతులు మారుతూ వచ్చింది. ఆ తర్వాత ఓ వ్యక్తి దాన్ని కొనుగోలు చేసి 45 ఏళ్లపాటు అలాగే ధ్వంసమైన స్థితిలో భద్రపరిచారు. తాజాగా వేలంలో ఈ కారును సొంతం చేసుకున్న వ్యక్తి.. దాన్ని బాగు చేసి మళ్లీ రేసింగ్ ట్రాక్‌పై పరుగులు పెట్టిస్తానని చెప్పడం విశేషం.