అమర్నాథ్ యాత్ర నిర్దేశిత సమయం కన్నా వారం ముందే ముగియనుంది. వచ్చే బుధవారంతో ఈ యాత్ర పూర్తవుతుందని, ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక ఉన్నతాధికారి చెప్పారు. ఈ ఏడాది దర్శనకాలాన్ని 62 రోజుల పాటు దీర్ఘకాలం ఉంచినా, యాత్ర ప్రారంభమైన రెండు వారాల తర్వాత నుంచి భక్తుల రాక తగ్గుముఖం పట్టింది.వాస్తవానికి యాత్ర ఈ నెల 31వరకు జరగాల్సి ఉన్నా, దానిని వారం రోజులు ముందుగానే 23తోనే ముగిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు నాలుగు లక్షల మంది మంచు శిలాకారంలో ఉన్న పరమేశ్వరుడిని దర్శించుకున్నారు. గత కొన్ని ఏండ్లుగా అమర్నాథ్డిని దర్శించుకునే భక్తుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది.