Movies

హ్యాపీ బర్త్ డే మెగాస్టార్

హ్యాపీ బర్త్ డే మెగాస్టార్

తెలుగు సినిమా మెగాస్టార్ అని ముద్దుగా పిలుచుకునే చిరంజీవి మంగళవారం (ఆగస్టు 22) 68వ ఏట అడుగుపెడుతున్నారు. కెరీర్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్…ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పెద్దదిక్కులా వ్యవహరిస్తున్నారు. సినీ పరిశ్రమలోకి సామాన్య నటుడిగా కెరీర్ ప్రారంభించినా ఆయన తనకు తానుగా అత్యున్నత శిఖరాలను చేరుకున్నారు. తన కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలను చిత్రపరిశ్రమకు పరిచయం చేశారు. మెగాహీరలే కాకుండా పరిశ్రమలో ఎంతోమంది హీరోలకు ఇన్ స్పిరేషన్ గా నిలిచారు మెగాస్టార్. కోట్లాది మంది గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని దక్కించుకుని మెగాస్టార్ అయ్యారు. అగ్రకథానాయకుడిగా..బాక్సాఫీసును శాసించిన ఈ సుదీర్ఘ ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవి నేర్చున్న పాఠాలెన్నో. తాను నేర్చుకున్న ప్రతిపాఠాన్ని విజయవంతంగా మార్చుకుంటూ తనకు తానుగా మెగా హిట్స్ తో ఎవరూ అందుకోని స్థాయికి చేరుకున్నారు. చిరంజీవి గురించి ఇప్పటికీ చాలా మందికి తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాలను చూడండి.

చిరంజీవి 1992 బ్లాక్ బస్టర్ అనే విషయం చాలా మందికి తెలియదు. ఘరానామొగుడు సినిమా 10కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన తొలి తెలుగు సినిమా. నగ్మా, వాణీ విశ్వనాథ్ ప్రధానపాత్రలు పోషించిన ఈ సినిమా 1993 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ మూవీ 1986 కన్నడ సినిమా అనురాగ అరలితుకు రీమెక్. దక్షిణ భారతదేశం నుంచి 59వ అకాడమీ అవార్డులకు ఆహ్వానించిన మొదటి నటుడు చిరంజీవి. ఆస్కార్ అవార్డులు 1987లో లాస్ ఏంజిల్స్ లోని కాలిఫోర్నియాలో జరిగింది. అప్పట్లోనే మెగాస్టార్ చిరంజీవి బిగ్ బి అమితాబ్ బచ్చన్ కంటే అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా చలనచిత్రపరిశ్రమలో నిలిచిపోయారు. 7 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్న తొలిభారతీయ నటుడిగా గుర్తింపు పొందారు.

కె. విశ్వనాథ్ డైరెక్షన్ లో 1987లో స్వయంక్రషి రష్యన్ భాషలోకి డబ్ చేసిన మొదటి తెలుగు చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ప్రసిద్ద మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రత్యేక ప్రదర్శనను కూడా నిర్వహించారు. ఈ గౌరవంతోపాటు స్పూర్తిదాయకమైన సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, ఆసియా పసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ప్రదర్శించబడింది. ఆపద్భాంధవుడు సినిమా కోసం 1992లో 1.25కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్న తర్వాత దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా గుర్తింపు పొందారు. ఆ సమయంలో కొన్ని ప్రముఖ మ్యాగజైన్లు చిరంజీవిని బచ్చన్ కంటే పెద్దగా పేర్కొన్నాయి.

90లలో (1990-1999) భారతదేశంలో అత్యధిక వ్యక్తులను ప్రేరేపించిన టాప్ 10 మంది వ్యక్తులలో చిరంజీవి ఒకరు. 1999లో, చిరంజీవి తన తొలి హాలీవుడ్ చిత్రం ‘ది రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్’లో నటించే అవకాశం వచ్చింది. దురదృష్టవశాత్తు, అనుకోని కారణాల వల్ల ప్రాజెక్ట్ షూటింగ్ నిలిచిపోయింది. భారతీయ సినిమా లెజెండరీ ఫిల్మ్ మేకర్, కె బాలచందర్ ఒకసారి ఇలా అన్నాడు: “చిరంజీవిలో రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరూ ఉన్నారు. అతను యాక్షన్ చేయడమే కాదు, నటించగలడు అని అన్నారు. అప్పట్ల తెలుగు హీరోలు అంటే ఉత్తరాదిలో చిన్నచూపు ఉండేది. ఇంతటి ఘన చరిత్ర సాధించడమంటే నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగిన విషయమే. ఇంత గొప్ప నటుడికి పుట్టినరోజులు శుభాకాంక్షలు తెలుపుతోంది. హ్యాపీ బర్త్ డే మెగాస్టార్.