ఏపీ సీఎం జగన్ (Cm Jagan) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ తరుణంలో ఆయన విజయవాడ మొగల్రాజపురంలోని టెనెట్ డయాగ్నస్టిక్ సెంటర్లో (Diagnostics centre) వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కాలి మడమ నొప్పితో సీఎం జగన్ బాధపడుతున్నట్లు సమాచారం. అయితే వైద్యులు ఆయనకు ఎంఆర్ఐ మెడికల్ టెస్ట్ (MRI medical Test) చేశారని తెలుస్తోంది. ఈ విషఆంధప్రదేశ్ సీఎం జగన్ గత కొంతకాలంగా కాలి మడమ నొప్పి (Heel Pain)తో బాధపడుతున్నారని, గతంలోనే ఆయన నొప్పి వల్ల జనరల్ చెకప్ చేయించుకున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ మధ్యనే సీఎం జగన్ వ్యాయాయం చేస్తుండగా కాలు బెణికిందని, ఆ సమయంలో ఆయనకు వైద్యులు చికిత్స చేశారని సమాచారం. వైద్యులు సీఎం జగన్ ను విశ్రాంతి తీసుకోమన్నారని సలహా కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఆయన మడమనొప్పితో బాధ పడుతుండగా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు.యంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
జగన్‌కు అస్వస్థత
