ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అటు హీరోల దగ్గర్నుంచి ఇటు అందాల ముద్దుగుమ్మలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కారణం తెలియదు కానీ చిన్న వయసులోనే పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. ఒకటి రెండు సినిమాలు చేసిన హీరోయిన్స్ దగ్గర నుంచి వయసు ముదిరిపోతున్న ముద్దుగుమ్మల సైతం కంటిన్యూగా ఎవరికి చెప్పకుండా పెళ్లిళ్లు చేసుకుని అభిమానులకు షాక్ ఇస్తున్నారు. మరి కొంతమంది తాము ఇప్పటికే ప్రేమలో ఉన్నామని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని అఫీషియల్ అనౌన్స్ చేసి కంగు తినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలోని మరో స్టార్ హీరోయిన్ ఎవరికీ తెలియకుండా పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.
క్యూట్ వాయిస్ సొంతం చేసుకున్న ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు వర్సటైల్ యాక్ట్రెస్ నిత్యామీనన్ . ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ బ్యూటీ గా పేరు సంపాదించుకుంది. నిత్యామీనన్ సింగర్ గా, హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈమె తన చిన్ననాటి స్నేహితుడు అయిన ఓ స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతుందట . ప్రజెంట్ ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్నాళ్లు నిత్యామీనన్ పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్తలు చాలా సార్లు వినిపించిన పెద్దగా జనాలు పట్టించుకోలేదు. కానీ ఈసారి మలయాళీ ఇండస్ట్రీలో మాత్రం నిత్యామీనన్ పెళ్లి వార్త బాగానే ట్రెండ్ అవుతుంది. పలువురు స్టార్ సెలబ్రిటీస్ కూడా ఇదే విషయాన్ని నిజమే అంటూ చెప్పుకొస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో నిత్యామీనన్ పెళ్లి వార్త హల్ చల్ చేస్తో్ంది. అంతేకాదు నిత్య మీనన్ బీహేవియర్ గత కొంత కాలంగా చూస్తుంటే తేడాగానే ఉందని అంత అనుకున్నారు.. అనుకున్నట్లే జరగబోతుందని ఫ్యాన్స్ అంటున్నారు.