మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈనెల 28న ఢిల్లీ వెళ్ళనున్నారు. ఢిల్లీలో సీఈసీ కార్యాలయానికి వెళ్లనున్న చంద్రబాబు ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేయనున్నారు. టిడిపి అనుకూల ఓట్లు తొలగించడంపై చంద్రబాబు సీఈసీ కి ఫిర్యాదు చేయనున్నారని సమాచారం. వాలంటీర్ల ద్వారా తెలుగుదేశం, వైసీపీ అనుకూల ఓట్ల సమాచారం సేకరించి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయబోతున్నారు.ఏపీలో ఓట్ల జాబితాలో అక్రమాలపై సమాచార సేకరణకు ఇప్పటికే టిడిపి కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. విశాఖ, విజయవాడ, ఉరవకొండ ఓట్ల తొలగింపునకు సంబంధించిన ఆధారాలను చంద్రబాబు ఎన్నికల సంఘానికి సమర్పించనున్నారు.