ScienceAndTech

రేపే చంద్రయాన్-3 ల్యాండింగ్

రేపే చంద్రయాన్-3 ల్యాండింగ్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మక చంద్రయాన్ -3 సేఫ్ ల్యాండింగ్ కు అంతా సిద్ధమైంది. బుధవారం సాయంత్రం జరిగే సేఫ్ ల్యాండింగ్ కోసం భారత్ మాత్రమే కాదు ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఇలాంటి అపూర్వ ఘట్టం నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ఈ చారిత్రక ఘట్టాన్ని స్టూడెంట్స్ లైవ్ లో చూసేలా విద్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు డీఈవోలు, ప్రిన్సిపల్స్ కు స్కూల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు.ఆగస్టు 23న సాయంత్రం 5.30 సమయంలో చంద్రయాన్ -3 సేఫ్ ల్యాండింగ్ కానున్నట్లు ఇస్రో ప్రకటించింది. దీన్ని తెలంగాణ విద్యా ఛానెల్స్ అయిన టీశాట్, నిపుణ లో లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. ఈ ఛానెల్స్ ను ఆయా ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక్ తెరలు, ప్రొజెక్టార్లు ఏర్పాటు చేసి టెలికాస్ట్ చేయనున్నారు. పాఠశాల ముగిసిన విద్యార్థులు ఒకచోట చేరి ఈ లైవ్ వీడియోని వీక్షించేలా విజ్ఞప్తి చేయనున్నారు.

దేశంలోని విద్యార్థులు, యువత అంతా చంద్రయాన్-3 సేఫ్ ల్యాండింగ్ ను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూడాలని ఇస్రో కోరింది. భారత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అయిన ఇది యువతకు స్ఫూర్తి నిచ్చేలా విజయవంతం అవుతుందని.. అందురూ అందుకోసం ప్రార్థించాలని విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే చంద్రయాన్-3 కీలక దశకు చేరుకోగా.. ల్యాండర్ మాడ్యుల్ చంద్రుడికి మరింత చేరువైంది. ల్యాండర్ తీసిన చంద్రుడి ఫోటోలను కూడా ఇస్రో రిలీజ్ చేసింది. జయహో భారత్.. జయహో ఇస్రో అంటూ యావత్ భారతావని చంద్రయాన్-3 సేఫ్ ల్యాండ్ అవ్వాలని కోరుకుంటోంది.