ScienceAndTech

బెజవాడ మురుగుతో విద్యుత్ తయారీ

బెజవాడ మురుగుతో విద్యుత్ తయారీ

మురుగునీటి శుద్ధికి విజయవాడ నగర పాలక సంస్థ ప్రణాళిక ప్రకా­రం ముందుకెళ్తోంది. ఇప్పటికే ఉన్న మురు­గు­నీటి శుద్ధి ప్లాంట్ల(ఎస్టీపీ)ను ఆధునికీకరిస్తూనే.. పెరుగుతున్న జనాభాకు అను­గుణంగా కొత్త ప్లాంట్లను నెలకొల్పుతోంది. మరోవైపు ఈ ప్లాంట్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ ఆదాయాన్ని ఆదా చేసుకునేలా ఏర్పాటు చేస్తోంది. నగరంలో 150 ఎంఎల్‌డీ సామర్థ్యంతో అజిత్‌సింగ్‌ నగర్, ఆటోనగర్, జక్కంపూడి, రామలింగేశ్వర్‌నగర్‌­లో రెండు ఎస్టీపీలు­న్నా­యి. పెరుగుతున్న జనా­భా­కు అనుగుణంగా కొత్త­గా రామలింగేశ్వర్‌ నగర్‌లో 20 ఎంఎల్‌డీ, ఆటోనగర్‌లో 10 ఎంఎల్‌డీ సామర్థ్యంతో రెండు ఎస్టీపీలను నిర్మి­స్తున్నారు. ఈ ప్లాంట్లలో నీరు శుద్ధి చేసే సమ­యంలో వచ్చే మిథేన్‌ గ్యాస్‌ను స్క్రబ్బర్‌ మెషిన్ల ద్వారా శుద్ధి చేస్తారు. అందులోని తేమ, ఆమ్లాల­ను తీసేయగా వచ్చే మిథేన్‌ గ్యాస్‌కు టర్బెయి­న్‌లను అనుసంధానం చేస్తారు. తద్వారా వి­ద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్‌ను అక్క­డ ఎస్‌టీపీలలోనే విని­యోగించుకోను­న్నా­రు. ప్రస్తుతం సింగ్‌నగర్, జక్కంపూడి, రామలింగేశ్వర్‌ నగర్‌లోని నాలుగు ఎస్‌­టీ­పీలకు స్క్రబ్బర్‌ మెషిన్లు ఏర్పాటు చేసి, మిథేన్‌ గ్యా­స్‌ను శుద్ధి చేయడం ద్వారా గ్యాస్‌ టర్బె­యిన్‌లకు అనుసంధానం చేస్తు­న్నా­రు. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. రామలింగేశ్వర్‌ నగర్‌లో ఏర్పాటు చేసిన ఎస్టీపీ పాతది కావడంతో జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) సూచించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా దానిని ఆధునికీకరిస్తున్నారు. ఈ పనుల కోసం రూ.14.93 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇందుకు యునైటెడ్‌ నేషన్స్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (యునిడో) సహకారం అందిస్తోంది. విజయవాడ కార్పొరేషన్‌కు రూ.10 కోట్ల నిధులను అందించింది. ఈ నిధులు కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు బయో గ్యాస్‌ ప్లాంట్లను స్థాపించడంలో ఈ నిధులు కీలక భూమిక పోషిస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థ నుంచి వచ్చిన స్థిరమైన పద్ధతులను అవలంబించడంతోపాటు, పర్యావరణ సవాళ్లను తగ్గించడంలో విజయవాడ కార్పొరేషన్‌కు ప్రత్యేక గుర్తింపు వస్తోంది.