WorldWonders

హవాయి కార్చిచ్చు:ఊరు మొత్తం కాలి బూడిదైనప్పటికీ ఒక ఇల్లు చెక్కుచెదరలేదు

హవాయి కార్చిచ్చు:ఊరు మొత్తం కాలి బూడిదైనప్పటికీ ఒక ఇల్లు చెక్కుచెదరలేదు

సాధారణంగా ఎన్నో కంపెనీలు ఇక తమ ప్రోడక్ట్ ను ప్రమోట్ చేసుకునేందుకు టీవీలు అడ్వర్టైజ్మెంట్ లు ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లలో కొన్ని కాస్త విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. మిగతా ప్రోడక్ట్ లతో పోల్చి చూస్తే తమ ప్రోడక్ట్ అని అత్యుత్తం అని చెప్పాలని ప్రయత్నిస్థాయి ఆయా కంపెనీలు. కొన్నిసార్లు కాస్త ఎక్కువ క్రియేటివిటీ చూపిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ముఖ్యంగా పెయింట్ కంపెనీలు తమ పెయింట్ వేసుకుంటే ఎన్ని సంవత్సరాలు అయినా ఇల్లు చెక్కుచెదరకుండా ఉంటుంది అని చూపిస్తూ ఉంటాయి.

ఇక ఆ ప్రకటనలో పక్కన ఉన్న ఇళ్లన్నీ పాతబడిపోతే.. ఇక ఆ కంపెనీ పెయింట్ వేసిన ఇల్లు మాత్రం విలమిలా మెరిసిపోతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే అచ్చం ఇక్కడ జరిగిన ఘటన కూడా ఇలా ఏకంగా ఒక వాణిజ్య ప్రకటనకు బాగా సరిపోయింది. ఏకంగా కార్చిచ్చుతో చుట్టుపక్కల ఉన్న ఇల్లు మొత్తం కాలి బూడిదయ్యాయి. కానీ ఒక్క ఇల్లు మాత్రం కనీసం చెక్కుచెదరలేదు. కనీసం ఆ ఇంటికి మరక కూడా అంటలేదు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది అని చెప్పాలి.ఇటీవల హవాయి దీవిలో కార్చిచ్చు ఎంతటి విషాదాన్ని నింపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ప్రకృతి విపత్తు దాటికి లాహైనా రిసార్ట్ నగరంలోని అన్ని ఇల్లు కూడా అగ్నికి ఆహుతిగా మారిపోయాయి. ఈ క్రమంలోనే తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది అని చెప్పాలి. అయితే ఈ కార్చిచ్చు కారణంగా ప్రాణ నష్టం కూడా వాటిలింది. దీంతో ఇక ఎంతోమంది జనాలు గూడు లేని వారిగా మారిపోయారు. అయితే ఇంతటి ప్రమాదంలో కూడా ఒక భవనం మాత్రం చెక్కుచెదరకుండా ఉండిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారిపోయాయి. ఇల్లు కాలిపోకుండా ఉండడానికి కారణం పైకప్పు మెటల్ రూఫింగ్ ఉండటమే అని అధికారులు తెలిపారు. ఇతర ఇల్లు చెక్కతో నిర్మితం కావడంతో అంటుకున్నాయని అధికారులు తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో ఏకంగా 114 మంది చనిపోయారు.