తిరుమల (Tirumala) లో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు టీటీడీ (TTD) అధునాతన సేవలు అందించేందుకు పలు చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా కాలినడకన వచ్చే భక్తులకు ప్రస్తుతం ఉన్న లగేజీ విధానాన్ని ( Luggage) మరింత సరళం చేసేందుకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసింది. గతంలో కాలిబాటలో వచ్చే భక్తుల లగేజీని తిరుపతి (Tirupati) లో తీసుకుని తిరుమలలో మ్యానువల్‌గా ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానం వల్ల పలుమార్లు భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తుల ఇబ్బందులను తొలగించేందుకు కొత్తగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ ఎంతగానో ఉపయోగకరం ఉంటుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ నూతన విధానానికి బాలాజీ బ్యాగేజ్ సెంటర్ (Balaji Baggage Center) గా నామకరణం చేసినట్లు ఆయన వివరించారు. లగేజీ కేంద్రాల్లో టికెట్ స్కాన్ చేయగానే భక్తుల లగేజీ ఎక్కడ ఉందో పూర్తి వివరాలు తెలుస్తాయని వివరించారు. దాతల సహకారంతో విజిలెన్స్ అధికారులు తయారు చేసిన ఈ విధానాన్ని వైకుంఠ క్యూకాంప్లెక్స్, రూ.300 ప్రత్యేక దర్శనం, శ్రీవారి మెట్లు, అలిపిరి మెట్ల మార్గంలో ఈ ఉచిత కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఈవో పేర్కొన్నారు.
తిరుమల భక్తుల సౌకర్యార్థం సరికొత్త సాఫ్ట్‌వేర్
Related tags :