ఓ కొత్త పరిశోధన ప్రకారం, ఒక సాధారణ రక్త పరీక్ష టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో అత్యంత ప్రమాదకరమైన గుండె, మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని కూడా అంచనా వేయవచ్చు. అమెరికన్ హార్ట్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, టైప్ 2 డయాబెటిస్, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న 2వేల 5వందల మందికి పైగా క్లినికల్ ట్రయల్ నిర్వహించగా.. వారి రక్త పరీక్షలలో నాలుగు బయోమార్కర్ల అధిక స్థాయిలు గుండె, మూత్రపిండాల సమస్యలను సూచించాయి.
“కొన్ని బయోమార్కర్ల అధిక స్థాయిలు గుండె, మూత్రపిండాల సమస్యలకు సూచికలు. భవిష్యత్తులో వ్యాధి పురోగతి ప్రమాదాన్ని అంచనా వేయడంలో ఇవి సహాయపడవచ్చు” అని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో కార్డియాలజిస్ట్ హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రధాన రచయిత జేమ్స్ జానుజీ అన్నారు. కానాగ్లిఫ్లోజిన్, సోడియం గ్లూకోజ్ కో-ట్రాన్స్పోర్టర్ 2 ఇన్హిబిటర్ (SGLT2 ఇన్హిబిటర్) తీసుకున్న వ్యక్తులు, మూడు సంవత్సరాల కాలంలో ప్లేసిబో తీసుకున్న వారితో పోలిస్తే నాలుగు బయోమార్కర్ల స్థాయిలు తక్కువగా ఉన్నాయి. కెనాగ్లిఫ్లోజిన్‌తో చికిత్స గుండె వైఫల్యం మరియు ఇతర గుండె సమస్యల కోసం ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించడంలో సహాయపడుతుంది.
నాలుగు బయోమార్కర్ల సాంద్రతలపై కెనాగ్లిఫ్లోజిన్ ప్రభావాలను అంచనా వేయడానికి పరిశోధకులు 2వేల 627 మంది వ్యక్తుల రక్త నమూనాల నుంచి బయోమార్కర్ డేటాను విశ్లేషించారు. రోగులను తక్కువ, మధ్యస్థ, అధిక-ప్రమాద వర్గాలుగా విభజించారు. అత్యధిక ప్రమాదం ఉన్న వ్యక్తులు మూడు సంవత్సరాల అధ్యయన వ్యవధిలో మూత్రపిండ వైఫల్యం, హృదయ సంబంధ సమస్యలు అధిక రెట్లుగా ఉండవచ్చని చూపించాయి. అధ్యయనం ప్రారంభంలో ప్రతి బయోమార్కర్ అధిక సాంద్రతలు పాల్గొనేవారి గుండె, మూత్రపిండాల సమస్యల తీవ్రతను గట్టిగా అంచనా వేస్తున్నట్లు విశ్లేషణ కనుగొంది.