కన్నడలో రిషబ్ శెట్టి హీరోగా సప్తమి గౌడ హీరోయిన్ గా రిషబ్ శెట్టి దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా కాంతార. చిన్న సినిమాగా రిలీజయి కన్నడలో విజయం సాధించిన అనంతరం దేశమంతటా విడుదల అయి భారీ విజయం సాధించింది. కేవలం 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార సినిమా 450 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. కాంతార సినిమాని ప్రేక్షకులతో పాటు అన్ని పరిశ్రమల సెలబ్రిటీలు కూడా మెచ్చుకున్నారు.ఇక ఈ సినిమాకు పార్ట్-2 కూడా తెరకెక్కబోతుందంటూ కొన్ని నెలల కింద రిషబ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేశాడు. అంతేకాకుండా ఇది సీక్వెల్‌లా కాకుండా ప్రీక్వెల్‌లాగా రూపొందిస్తాడట. అంటే రిషబ్ తండ్రి గురించి, ఆయన చనిపోవడం, ఆ పల్లె సంప్రదాయాల వెనుక మూలం ఎక్కడ మొదలయ్యింది, దేవుడు ప్రత్యేకంగా ఒక తెగవాళ్లనే ఎందుకు పూనుతాడు లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ప్రీక్వెల్‌లో చూపించబోతున్నాడు. దీని కోసం రిషబ్ గ్రౌండ్‌వర్క్ చాలానే చేశాడట. ఇక తొలిపార్టును రూ.16 కోట్లలోపే ముగించిన రిషబ్.. ప్రీక్వెల్ కోసం ఏకంగా రూ.120 కోట్ల బడ్జెట్‌ను ప్లాన్ చేస్తున్నాడట. ఒక్క ప్రీ ప్రొడక్షన్ కోసమే రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది.