NRI-NRT

నాట్స్ టంపాబే ఆధ్వర్యంలో పోలీసులతో సమావేశం

నాట్స్ టంపాబే ఆధ్వర్యంలో పోలీసులతో సమావేశం

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) ఆధ్వర్యంలో ఫ్లోరిడాలోని టంపాబేలో పోలీసులతో సమావేశాన్ని (Coffee with a cop) నిర్వహించింది. స్థానిక అధికారులకు, ప్రజలకు మధ్య అవగాహన పెంపొందించడంతో పాటు స్థానిక నియమ నిబంధనలపై అవగాహన కల్పించేలా ఈ సదస్సు నిర్వహించారు. ప్లోరిడా నాట్స్ సభ్యులు ఈ వర్క్ షాప్‌కు హాజరయ్యారు. టంపాబే డిప్యూటీ పోలీస్ అధికారి జాన్ ఫుట్ మాన్ పాల్గొన్నారు. నాట్స్ ప్రతినిధులను అభినందించారు.


ఫ్లోరిడాలోని టంపాబే నాట్స్ విభాగం స్వాతంత్ర్య దినోత్సవం పరేడ్ నిర్వహించింది. టంపాలోని భారతీయ సాంస్కృతిక కేంద్రం(ఐసీసీ)లో నాట్స్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆఫ్ టంపా బే సమ్యుక్తంగా ఈ పరేడ్‌లో పాల్గొన్నాయి. నాట్స్ సభ్యులు, స్థానిక తెలుగువారు పాల్గొన్నారు. రాజేష్ కాండ్రు, విజయ్ కట్ట, అచ్చిరెడ్డి శ్రీనివాస్, సుధీర్ మిక్కిలినేని, సుధాకర్ మున్నంగి, భాను ధూళిపాళ్ల, భాస్కర్ సోమంచి తదితరులు పాల్గొన్నారు. నాట్స్ సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు సభ్యులు డా. కొత్త శేఖరం, నాట్స్ బోర్డు వైస్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాది, సలహా కమిటీ సభ్యులు ప్రసాద్ ఆరికట్ల, సురేష్ బుజ్జా, చాప్టర్ కోఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కో ఆర్డినేటర్ విజయ్ కట్టలు సహకరించారు. నాట్స్ చైర్ వుమెన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి(బాపు) నూతి, నాట్స్ కార్యదర్శి రంజిత్ చాగంటి, కార్యనిర్వాహక మీడియా కార్యదర్శి మురళీకృష్ణ మేడిచెర్లలు ధన్యవాదాలు తెలిపారు.

* ఫిలడెల్ఫియాలో…
నాట్స్ ఫిలడెల్ఫియా ఆధ్వర్యంలో చేపట్టిన ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన లభించింది. విద్యార్ధుల్లో సేవా భావాన్ని పెంచడంతో పాటు సాటి వారికి సాయం అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ఫుడ్ డ్రైవ్‌ను విద్యార్ధులు ముందుండి నడిపించారు. స్థానిక విద్యార్థి కాగితపు అఖిల్ నేతృత్వం వహించాడు. సేకరించిన ఆహారపదార్థాలతో పాటు 5000 డాలర్లను పెన్విలినియాలోని చెస్టర్ కౌంటీ ఫుడ్ బ్యాంక్‌కు అందించారు.