Politics

లోకేష్‌కు నోటీసులు జారీ చేసిన పోలీసులు

లోకేష్‌కు నోటీసులు జారీ చేసిన పోలీసులు

నారా లోకేష్‌కి పోలీసులు షాకిచ్చారు. నిన్న సభలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన లోకేష్‌కు నోటీసులు జారీ చేశారు. యువగళం పాదయాత్రలో భాగంగా నిన్న నిర్వహించిన సభలో అధికారంలోకి రాగానే ఇద్దరు ఎమ్మెల్యేలను చంపుతానంటూ టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దంటూ లోకేష్‌కి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లగా.. ఆయనను కలవనివ్వకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ నోటీసులు ఇవ్వాలని పోలీసులు చెప్పడంతో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ నోటీసులు తీసుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయమని పోలీసులకు కొనకళ్ల నారాయణ హామీ పత్రం ఇచ్చారు.