ScienceAndTech

సెల్^ఫోన్లలో ఉపగ్రహ సాంకేతికత

సెల్^ఫోన్లలో ఉపగ్రహ సాంకేతికత

స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త.. త్వరలో శాటిలైట్ కనెక్టివిటీ స్మార్ట్ ఫోన్లలో కూడా అందుబాటులోకి రాబోతోంది. ఈ ఫీచర్తో నెట్వర్క్ సిగ్నల్ లేని మారు మూల ప్రాంతాల్లో కూడా మేసేజ్లు పంపించొచ్చు. మీ ఫోన్‌లోని శాటిలైట్ కమ్యూనికేషన్ టెరెస్ట్రియల్ నెట్‌వర్క్ అందుబాటులో లేనప్పుడు కూడా కనెక్షన్ అందించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించగలదు. గూగుల్ దీన్ని ఆండ్రాయిడ్ 14కి అనుకూలంగా తీసుకొస్తుంది. Oppo,Vivo,Xiaomi క్వాల్‌కామ్ ద్వారా ఈ ఫీచర్ ను అందుబాటులో తీసుకురానున్నాయి. భవిష్యత్ లో ఫోన్‌లలో శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రాధాన్యత పెరగొచ్చు.

ఇంతకీ శాటిలైట్ కనెక్టివిటీ అంటే ఏమిటీ?
పాత శాటిలైట్ ఫోన్ గురించి మీరు విని, చూసి ఉంటారు. సెల్ ఫోన్లలా కాకుండా శాట్ ఫోన్ ఇతర ఫోన్లకు, టెలిఫోన్ నెట్ వర్క్ కు రేడియో లింక్ ద్వారా భూగోళ సెల్ సైట్లకు బదులుగా భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాల ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది రిమోట్ లోకేషన్లలో కూడా ఉపయోగకరంగా ఉండటానికి వీలుగా ఉంటుంది. శాట్ ఫోన్ ను జేబులో పెట్టుకొని తిరగలేం కావడట్టి.. ఆధునిక స్మార్ట్ ఫోన్లలో ఈ సాంకేతికతను ప్రోత్సహిస్తున్నారు. దీని ద్వారా టెక్ట్స్ మేసేజ్లు మాత్రమే పంపించ వచ్చు. ఈ ఫీచర్ ను స్మార్ట్ ఫోన్లలో అమర్చేందుకు కొన్ని హార్డ్ వేర్ అవసరం ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్‌లలో శాటిలైట్ కనెక్టివిటీ ఎలా పని చేస్తుంది?

శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ కోసం స్మార్ట్ ఫోన్ తయారీదారులు హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లను ఏకీకృతం చేస్తారు. Apple iPhone 14,14 Pro మోడల్‌లు సాఫ్ట్‌వేర్‌తో లోతుగా అనుసంధానించబడిన హార్డ్‌వేర్ భాగాలను కలిగి ఉంటాయి.

శాటిలైట్ కనెక్టివిటీకి మద్దతు ఇవ్వడానికి, స్మార్ట్‌ఫోన్ తయారీదారులు హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్‌లను గట్టిగా ఏకీకృతం చేయాలి. Apple iPhone 14 మరియు 14 Pro మోడల్‌లు సాఫ్ట్‌వేర్‌తో లోతుగా అనుసంధానించబడిన హార్డ్‌వేర్ భాగాలను కలిగి ఉంటాయి. యాంటెనాలు నేరుగా ఉపగ్రహానికి కనెక్ట్ అయ్యేలా చేస్తాయి.

భవిష్యత్తులో..
భవిష్యత్ అంతా ఈ ఫీచర్ దే.. అన్ని స్మార్ట్ ఫోన్లు ఈ ఫీచర్ ను భవిష్యత్ లో అందుబాటులో తీసుకురానున్నాయి. Xiaomi, Oppo, Vivo, Motorola, Nothing, Honorతో సహా ఫోన్ తయారీదారులు తమ ఫోన్‌లలో శాటిలైట్ కమ్యూనికేషన్ అమర్చేందుకు సిద్ధంగా Qualcomm మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC)లో ప్రకటించింది .