భోళా శంకర్ చిరంజీవి కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ గా రికార్డులు ఎక్కింది. రెండో రోజే బాక్సాఫీస్ వద్ద కుప్పకూలింది. వరల్డ్ వైడ్ కేవలం రూ. 27 కోట్ల షేర్ రాబట్టింది. రూ. 79 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన భోళా శంకర్ యాభై కోట్లకు పైగా నష్టాలు మిగిల్చింది. భోళా శంకర్ విషయంలో చిరంజీవి అభిమానులు సైతం విమర్శల దాడి చేశారు. మీరు రీమేక్స్ చేయవద్దని సోషల్ మీడియా వేదికగా ఆయనకు సలహాలు ఇచ్చారు. సొంత అభిమానులే పనిగట్టుకుని భోళా శంకర్ పై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు.
దీనిపై బేబీ చిత్ర నిర్మాత ఎస్కేఎన్ స్పందించారు. చిరంజీవి అభిమానులను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశాడు. సినిమా బాగుంటే జై కొట్టేది మనమే బాగోకపోతే తొక్కేసేది మనమే. ఫస్ట్ హాఫ్ అలా ఉంది. సెకండ్ హాఫ్ ఇలా ఉంది, ఇంటర్వెల్ మరోలా ఉందని ముందే చెప్పేస్తాము. నాలుగు పదుల వయసుకే నడవలేని హీరోలు ఉన్న పరిశ్రమలో ఏడు పదుల వయసు దగ్గర పడుతున్నా చిరంజీవి అడిస్తున్నాడు. ఓడిస్తున్నాడు. అది ఆయన విల్ పవర్.
ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రాల్లో భోళా శంకర్ లో ఆయన చాలా గ్లామరస్ గా కనిపించారు. కానీ ఆ సినిమాను కూడా మనం నిలబెట్టుకోలేకపోయాం. బాస్ కి తెలుసు రీమేక్స్ చేయాలా? స్ట్రయిట్ మూవీస్ చేయాలా? అని. మీరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మోకాలికి ఆపరేషన్ చేయించుకుని కూడా బాస్ మన కోసం డాన్సులు చేస్తున్నారు. ఆయనకు మనం అండగా ఉండాలి. మనం ఐకమత్యంగా ఉంటే కొట్టేవాడు లేడు. హిట్లర్ ముందు బాస్ పనైపోయిందన్నారు. ఖైదీ 150 ముందు కూడా అన్నారు. అలా జరగలేదు కదా… మళ్ళీ హిట్టు కొట్టి చూపిస్తాం… అని ఎమోషనల్ అయ్యాడు.
భోళా శంకర్ తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్ గా తెరకెక్కింది. మెహర్ రమేష్ దర్శకుడిగా ఉన్నారు. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్నా హీరోయిన్ గా నటించింది. కీర్తి సురేష్ కీలక రోల్ చేసింది. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 11న భోళా శంకర్ విడుదలైంది. ఆగస్టు 22న బర్త్ డే జరుపుకున్న చిరంజీవి రెండు కొత్త చిత్రాలు ప్రకటించారు.