వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ కీలక సూచన చేసింది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ నిర్మల్, మంచిర్యాల, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆగస్టు 25 నుంచి 28 వరకు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, ఏపీలోని నెల్లూరు, పార్వతీపురం, అల్లూరి, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లా్లో ఓ మోస్తరు వర్సాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది.