ప్రతి రోజూ మనం చేసే స్నానాలలో ఎన్నో రకాలు ఉన్నాయి.. హిందూ శాస్త్రం ప్రకారం స్నానాన్ని ఒక సమయంలో మాత్రమే చెయ్యాలని నిపుణులు అంటున్నారు.. కొంత మంది ప్రజలు కాకి స్నానం చేసేసి మామ అనిపించుకుంటూ ఉంటారు. కాకి స్థానం అంటే శరీరం మొత్తం తడవకుండా ఏదో చేసాంలే అనిపించుకునేలా హడావిడిగా చేసే స్నానన్ని కాకి స్నానం అని అంటారు.కానీ స్నానాలలో చాలా రకాలు ఉన్నాయని చాలామందికి తెలియదు అదేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
శరీరం నుంచి దుర్వాసన రాకుండా, తేలిగ్గా ఉండేందుకు స్నానం చెయ్యడం తప్పనిసరి..చన్నీటితో స్నానం, గోరువెచ్చని నీటితో స్నానం, వేడి నీళ్లతో స్నానం ఎన్నో రకాలుగా చేయవచ్చు. గోరువెచ్చని నీటిలో తులసి ఆకులు వేపాకులు, నిమ్మరసం వేసి స్నానం చేస్తే శరీర సమస్యలు రావు. క్రమం తప్పకుండా స్నానం చేయడం శారీరక శుభ్రతలో భాగంగా నిర్వహిస్తారు. అటువంటి స్నానంలో చాలా రకాలు ఉన్నాయని వాటికి అర్ధాలు ఉన్నాయని చాలామందికి తెలియదు..
ఋషి స్నానం, దేవ స్నానం, మానవ స్నానం రాక్షస స్నానం, వారుణ స్నానం ఇలా స్నానాలకు చాలా రకాల పేర్లు కూడా ఉన్నాయి.. నిజానికి ఏ సమయంలో స్నానం చేయకూడదు చాలామందికి తెలియదు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి 5 గంటల మధ్య స్నానం చేయడం ఉత్తమం. దీన్నే బ్రహ్మ ముహూర్తం అంటారు. పూజలు ఈ బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటే మంచిదని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదు గంటల మధ్య చేసే స్నానాన్ని ఋషి స్నానం అంటారు. ఇది ప్రథమం. ఐదు నుంచి ఆరు గంటల మధ్య చేసే స్నానాన్ని దేవతా స్నానం అంటారు. ఇక ఆరు నుంచి ఏడు గంటల మధ్య చేసే స్నానాన్ని మానవ స్నానం అని అంటారు. ఇది అధమం. ఇక 7 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. ఇది అధామతి అధమం. ఇప్పుడు ఎక్కువగా మనుషులు చేసే స్నానం ఇదే..