మన దేశంలో ఎన్నో విచిత్రమైన ఆలయాలు ఉన్నాయి. కొన్ని రహస్యాలు అయితే ఇప్పటికీ మన సైంటిస్టులు ఛేదించలేకపోయారు. ఇప్పుడు చెప్పుకోబోయే ఆలయం కూడా అలాంటిదే..! అక్కడకు వెళ్లాలంటే వెన్నుకో వణుకు పుడుతుంది. తల్చుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఆలయాలు ఇలా కూడా ఉంటాయా అనిపిస్తుంది. అక్కడ ఆచారాలు, వారు పాటించే సంప్రదాయాలు చూసి ముక్కున వేలేసుకుంటారు. అక్కడ భక్తుల విశ్వాసం అది అంతే. అలాంటి ఆలయాల్లో ఒకటి మహేందీపూర్ బాలాజీ ఆలయం.
ఈ ఆలయం రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఉంది. నిత్యం వేల మంది భక్తులు అక్కడకు వెళ్తుంటారు. అక్కడ భక్తుల్ని చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. కొందరు సలసలా కాగే నీళ్లను ఒంటిపై పోసుకుంటారు. ఇంకొందరు ఉరి వేసుకున్నట్లు వేలాడతారు. మరికొందరైతే గొలుసులతో కట్టేసుకుని తలను గోడకేసి కొట్టుకుంటారు. ఇంకొందరు పూనకం వచ్చినట్టు ఊగుతూ ఉంటారు. ఇంకొందరు తాళ్లతో తమని తాము కొట్టుకుంటారు.యంకరమైన అరుపులు, కేకలు, ఏడుపులు . ఇదంతా చూస్తే…ఇది ఆధ్యాత్మిక ప్రదేశమా లేదంటే దెయ్యాల కొంపా అనిపిస్తుంది. కానీ ఇదంతా దయ్యాలను వదిలించేందుకే అంటారు అక్కడి పూజారులు. రెండు కొండల మధ్య ఉన్న ఈ ఆలయంలో చాలా విచిత్రాలు కనిపిస్తాయి. దెయ్యాలు , ఆత్మల అడ్డంకులను వదిలించుకోవడానికి ఇక్కడ ప్రజలు బాలాజీ మహారాజ్ ఆలయానికి వస్తుంటారు.
వెనక్కు తిరిగి చూస్తే మీ పని అంతే..
సాధారణంగా ఆలయానికి వెళ్లి వచ్చేప్పుడు వెనక్కు తిరిగి చూస్తూ..మళ్లీ దర్శనానికి రావాలి అనుకుంటాం.. అందుకే ఎగ్జిట్ అయ్యేప్పుడు కూడా మనకు రాస్తారు.. పునఃదర్శనప్రాప్తిరస్తు అని.. కానీ ఈ ఆలయంలో వెనక్కు తిరిగి చూశారంటే.. మీకు దెయ్యం పడుతుంది. మహేందీపూర్ బాలాజీ ఆలయంలో మాత్రం ప్రసాదం ఇవ్వరు. పైగా దర్శనం తర్వాత వెనక్కు తిరిగి చూడకూడదట. అలా చూస్తే దయ్యాలను తమలోకి ఆహ్వానించినట్టే అని హెచ్చరిస్తారు పూజారులు. మెహదీపూర్ బాలాజీ దేవాలయంలో బాలుడి రూపంలో ఉన్న హనుమంతుడి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం ఛాతి మధ్యలో ఓ ఒక రంధ్రం ఉంటుంది..దాని నుంచి నిరంతర నీరు వస్తూనే . ఈ స్వామివారిని దర్శించుకుని వెళ్లిన తర్వాత వారం పాటు గుడ్లు, మాంసం, మద్యం, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఇవేవి తీసుకోకుడదట.