Politics

40 ఏళ్ల తర్వాత గ్రీస్‌లో పర్యటించిన తొలి భారత్ ప్రధాని

40 ఏళ్ల తర్వాత గ్రీస్‌లో పర్యటించిన తొలి భారత్ ప్రధాని

భారత ప్రధాని నరేంద్రమోదీ(Modi) ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన గ్రీస్‌(Greece) దేశం వెళ్లారు. 40 ఏళ్లలో ఒక భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే ప్రధాన అజెండాగా ఈ పర్యటన సాగుతోంది.బ్రిక్స్‌ సదస్సు అనంతరం దక్షిణాఫ్రికా నుంచి మోదీ గ్రీస్ చేరుకున్నారు. ఆ దేశ రాజధాని ఏథెన్స్‌లో దిగిన ఆయనకు ఆ దేశ విదేశాంగ మంత్రి జార్జ్‌ గెరాపెట్రైటిస్‌ స్వాగతం పలికారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ పర్యటనలో భాగంగా మోదీ ప్రవాస భారతీయుల్ని కలుసుకున్నారు. ఆయన వారితో కొద్దిసేపు ముచ్చటించారు. చిన్నారులను పలకరించారు. వారు ఆయనకు గ్రీక్‌ హెడ్‌డ్రెస్‌(హెడ్ బ్యాండ్‌)ను బహూకరించారు. మోదీ(Modi) బెస్ట్ పీఎం అని.. ఆయన అందరి మాటలు వింటారని ప్రవాస భారతీయులు వ్యాఖ్యానించారు.ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపర్చుకోవడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. రక్షణ రంగం బలోపేతం గురించి రెండు దేశాల నేతలు ప్రధానంగా చర్చించనున్నారని తెలుస్తోంది.