Movies

హీరో శర్వానంద్‌కు సర్జరీ

హీరో శర్వానంద్‌కు సర్జరీ

టాలీవుడ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్యామీలీ ఎండర్టైనర్‌గా ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్.. ఇండస్ట్రీ హిట్ మాత్రం అందుకోలేక పోయాడు. ఇదిలా ఉంటే.. శర్యానంద్‌కు ‘జాను’ సినిమా సమయంలో పెద్ద ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అప్పుడు జరిగిన ప్రమాదంలో తగిలిన గాయాలు మానినప్పటికీ.. కొన్ని నొప్పులు మాత్రం అలాగే ఉన్నాయట. వాటికి సర్జరీ చేయించుకునేందుకు.. శర్వానంద్ మరోసారి అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శర్వానంద్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన తొందరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు.