Business

రాష్ట్రంలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్

రాష్ట్రంలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్

తెలంగాణలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు పెరిగింది. గత సంవత్సర వేసవి కాలాన్ని విద్యుత్ డిమాండ్ అధిగమించింది. వానాకాలంలో 14 వేల 136 మెగావాట్ల విద్యుత్ సరఫరా అయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వానాకాలంలో అత్యధిక విద్యుత్ వినియోగం జరిగింది. వర్షాభావ పరిస్థితులు.. రాష్ట్రంలో భారీగా వరి సాగు విస్తీర్ణం పెరగడమే విద్యుత్ డిమాండ్‌కు కారణమని అధికారులు చెబుతున్నారు. అయితే డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్ సంస్థలు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. ఎంత డిమాండ్ వచ్చినా వ్యవసాయ రంగానికి, అన్ని రకాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని అంటున్నారు ట్రాన్స్‌కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు… దేశంలోనే అత్యధికంగా వ్యవసాయ రంగం విద్యుత్ వాడుతున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారాయన….