Movies

పుష్ప – 2 రిలీజ్ డేట్ ఖరారు

పుష్ప – 2 రిలీజ్ డేట్ ఖరారు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఆయన ప్రస్తుతం పుష్ప2లో నటిస్తున్నారు. ఈ సినిమా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ’పుష్ప’కు (Pushpa) సీక్వెల్‌గా వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్’ను జరుపుకుంటోంది. పుష్ప 1 ఎంత పెద్ద హిట్టో తెలియంది కాదు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా అదరగొట్టింది. ఇక పుష్ప2 విషయానికి వస్తే..ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తుండగా అల్లు అర్జున్‌కు జోడిగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తోంది. ఇతర పాత్రల్లో సునీల్, రావు రమేష్, ధనుంజయ, యాంకర్ అనసూయ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పటికే పలు రూమర్స్ రాగా.. ఇక లేటెస్ట్‌గా ఈసినిమా విడుదల తేది ఖరారు అయ్యినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం (Pushpa 2 Release date) మార్చి 22న విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ డేట్ దాదాపుగా ఖరారు అయ్యిందని.. ఈ విషయంలో అతి త్వరలో ఓ ప్రకటన విడుదలకానుందని సమాచారం. సమ్మర్ కానుకగా విడుదల చేయడంతో ఎక్కువగా ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఉందని టీమ్ భావిస్తోందట.

అది అలా ఉంటే.. 69వ జాతీయ సినీ పురస్కారాలలో తెలుగు చిత్ర పరిశ్రమకు పలు విభాగాల్లో పురస్కారాలు దక్కిన సంగతి తెలిసిందే. అయితే అందులో ముఖ్యంగా అల్లు అర్జున్‌కు పుష్పలో నటించినందుకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ గెలిచారు. దీంతో దేశవ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ఈ సినిమాలో ఓ అతిధి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అతిధి పాత్రలో తమిళ స్టార్ హీరో ఆ హీరో సూర్య కనిపిస్తాడని టాక్. ఇప్పటికే ఆయన నటించేందుకు ఓకే అన్నట్లు తెలుస్తోంది. సూర్య పాత్ర చిన్నదైనా.. ఓ కీలక సమయంలో వస్తుందట. ఇక ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను నల్లమల అడవుల ప్రాంతంలో ప్లాన్ చేశారట. ఓ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ చిత్రీకరణించనుందని తెలుస్తోంది.

ఇక్కడ మరో విషయం ఏమంటే.. పుష్ప3 కూడా రానుందని తెలుస్తోంది.పుష్ప సిరీస్‌లో మూడో పార్ట్ కూడా రానుందని లేటెస్ట్ టాక్. పుష్ప 2లో పుష్పరాజ్ రూలింగ్ చూపిస్తూ ఓ భారీ ట్విస్ట్‌‌తో ముగిస్తారట. ఇక పుష్ప 3తో ఈ సిరీస్‌ను ముగిస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కథ ఇప్పటికే రెడీ అయ్యిందట. ఈ మూడో పార్ట్.. 2025లో షురూ కానుందని తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న ఈ సినిమా నుంచి ఓ ఖతర్నాక్ గ్లింప్స్‌ను టీమ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వేర్ ఈజ్ పుష్ప అంటూ సాగిన ఈ వీడియో గ్లింప్స్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఓ భారీ సంస్థ నుంచి పుష్ప ది రూల్ మూవీ అన్ని హక్కుల కోసం (అన్ని భాషల రైట్స్‌తో పాటు డిజిటల్, శాటిలైట్ రైట్స్ కూడా) 900 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. పుష్ప ది రూల్ సినిమా 350 కోట్లతో తెరకెక్కనుందని తెలుస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న ‘పుష్ప 2 లో ఓ అదిరిపోయే ఫైట్ ఉండనుందట. ఇంటర్వెల్ బ్లాక్‌లో వచ్చే సీక్వెన్స్‌లో అల్లు అర్జున్ తన ఫ్రెండ్‌ను కాపాడే క్రమంలో సింహంతో ఫైట్ చేయాల్సి ఉంటుందట. ఈ సింహంతో పోరాడే సీన్‌ను ఓ రేంజ్‌లో డిజైన్ చేశారట సుకుమార్. చెప్పాలంటే ఆర్ ఆర్ ఆర్‌లో ఎన్టీఆర్ పులి సీన్ కంటే మించి ఉంటుందట. ఈ ఒక్క సీన్‌ను షూట్ చేసేందుకు టీమ్ థాయ్‌ల్యాండ్ వెళ్లనుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకు కూడా దేవిశ్రీప్రసాదే సంగీతం అందించనున్నారు. హీరోయిన్‌గా రష్మిక మందన్న కనిపించనుంది.. అయితే ఆమె పాత్రను కాస్తా తగ్గించనున్నారని తెలుస్తోంది. పుష్ప తో వచ్చిన క్రేజ్‌తో పుష్ప2ను ఓ రేంజ్‌లో అద్భుతంగా తెరకెక్కించనున్నారు దర్శకుడు సుకుమార్.. చూడాలి మరి ఈ సినిమా ఎన్ని రికార్డ్స్‌ను బద్దలు కొట్టనుందో. ఇక పుష్ప 2 తర్వాత ఈమరోసారి అల్లు అర్జున్, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.. గతంలో ఈ కాంబినేషన్‌లో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో వంటి సినిమాలు వచ్చాయి. ఇక నాలుగో సారి ఈ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో భీమ్లా నాయక్‌తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా కనిపించనుందని.. తెలుస్తోంది. ఈ భామ ఇప్పటికే వరుసగా విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ అదరహో అనిపిస్తోంది. ఇటీవల విడుదలైన విరూపాక్షతో మరో మంచి విజయాన్ని అందుకుంది.