తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగానే ప్రచారం షురూ చేసింది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపారు. ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఆశావహులు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ వేగవంతం అయింది. ఆశావహుల అర్జీలకు నేడే ఆఖరు కావడంతో ఇవాళ పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.ఇప్పటి వరకు వచ్చిన 723 దరఖాస్తులు వచ్చాయని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఇవాళ చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఒక్క ఇల్లందు నియోజకవర్గ టికెట్ కోసమే 36 మంది ఆశావ హులు అర్జీ పెట్టుకున్నారని చెప్పారు. ఇవాళ దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తర్వాత రేపటి నుంచి పరిశీలన జరగనుంది.
ఇప్పటికే రేవంత్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జీవన్ రెడ్డి, పొన్నాల, షబ్బీర్ అలీ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఇవాళ ంభట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, సీతక్క జగ్గారెడ్డి తదితర కీలక నేతలు దరఖాస్తు చేసుకోనున్నారు.