అమెరికాలో ప్రముఖ తెలుగు సంస్థగా గుర్తింపు పొందిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) సభ్యులకు సభ్యత్వ ప్రయోజనాలు అందజేసే ప్రణాళిక ఎట్టకేలకు అమలకు నోచుకుంది. ప్రస్తుత కార్యదర్శి కొల్లా అశోక్బాబు చొరవతో ఈ కల సాకారమైంది. అమెరికాలో నివసించే ప్రవాస తానా జీవితకాల సభ్యులు ఈ దిగువ అమెరికన్ సంస్థల నుండి తానా సభ్యత్వ ప్రయోజనాల రూపేణా రాయితీలు పొందవచ్చునని అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపుతో కలిసి అశోక్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కార్ రిపేర్, గృహావసరాలు, పర్యాటకం, అద్దె కార్లు వంటి సంస్థలకు బుకింగ్ సమయంలో తానాకు ప్రత్యేకమైన రాయితీ కోడ్ను వినియోగించి ఈ ప్రయోజనాలు పొందవచ్చు. తానా జీవితకాల సభ్యత్వ నెంబరును తప్పనిసరిగా ఇవ్వవల్సి ఉంటుంది. ఈ రంగాలతో పాటు మరిన్ని సంస్థలకు తానా సభ్యత్వ ప్రయోజనాలను విస్తరించే కార్యక్రమం చురుగ్గా చేపడుతున్నామని, ప్రవాస తెలుగు విద్యార్థులకు బీమా సౌకర్యంపై త్వరలో ప్రకటన చేస్తామని అశోక్ తెలిపారు.
తానా సభ్యులకు శుభవార్త. ఈ సభ్యత్వ ప్రయోజనాలు వినియోగించుకోండి.
Related tags :