Politics

నేడు ఖమ్మంలో అమిత్‌షా బహిరంగ సభ

నేడు ఖమ్మంలో అమిత్‌షా బహిరంగ సభ

తెలంగాణ గడ్డ మీద ఎన్నికల ఫీవర్‌ మొదలైంది.. బీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటికే భారీ బహిరంగ సభలతో దూసుకుపోతోంది.. కాంగ్రెస్‌ కూడా ఆ మధ్య ఖమ్మంలోనే పొంగులేటి చేరిక సభను భారీ ఎత్తున నిర్వహించింది. తాజాగా ఎస్టీ, ఎస్టీ డిక్లరేషన్‌ ప్రకటన సభతో.. తాము కూడా జెట్‌ స్పీడులో ఉన్నామని చెప్పకనే చెప్పింది. ఇక ఇప్పుడు బీజేపీ వంతు.. ఇప్పటికే అమిత్‌షా పర్యటన రెండు సార్లు వాయిదా పడింది.. మూడోసారి మాత్రం మిస్‌ కాకూడదని గట్టిగా ప్లాన్‌ చేశారు. ఖమ్మం ఖిల్లాలోనే సభకు ఏర్పాట్లు చేశారు.. రైతు గోస.. బీజేపీ భరోసా పేరుతో జరగనున్న బహిరంగ సభలో అమిత్‌ సా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఈ సందర్భంగా రైతుల కోసం పలు హామీలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోన్న కమలనాథులు.. ఖమ్మం వేదికగా పలు కీలక ప్రకటనలు చేయనున్నారు.అయితే కొద్దిరోజులుగా ప్రచారంలో ఉన్నట్లు.. అమిత్‌ షా సభలో భారీ చేరికలు ఉంటాయని..ముఖ్యంగా ఆయా పార్టీలకు చెందిన 22 మంది కీలక నేతలు కమల దళంలో చేరుతారని చెప్పారు. మరి ఆ 22 మంది ఎవరు..అమిత్ షా సభలో కనిపిస్తారా.. కాషాయ కండువా కప్పుకుంటారా అన్నది వేచి చూడాలి.

గన్నవరం టు ఖమ్మం.. అమిత్ షా పర్యటన వివరాలిలా..మరోవైపు, సభా ప్రాంగణంలో.. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా.. వాటర్ ప్రూఫ్ తో షెడ్లు ఏర్పాటు చేశారు.. ఇక, అమిత్‌ షా ఆదివారం మధ్యాహ్నం 1.30 కి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకొని..అక్కడ నుంచి భద్రాచలం వస్తారు.. సీతారాములను దర్శించుకొని.. హెలికాప్టర్‌లో ఖమ్మం చేరుకుంటారు.. మధ్యాహ్నం 3.45 నుంచి..4.35 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 4.45 నుంచి 5.30 వరకు..రాష్ట్ర బీజేపీ నేతలతో కోర్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత 5.50 కి ఖమ్మం నుంచి హెలికాప్టర్‌లో బయలు దేరి.. 6.20 కి గన్నవరం ఎయిర్ పోర్టుకి చేరుకుంటారు.

సభకు లక్ష మందిని సమీకరించే ప్రయత్నం…ఖమ్మం డిగ్రీ కాలేజి గ్రౌండ్‌లో జరగనున్న బహిరంగ సభకు.. కనీసం లక్ష మందిని సమీకరించాలని బీజేపీ నేతల వ్యూహం.. ముఖ్యనేతలంతా ఖమ్మంలో మకాం వేసి.. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే వెయ్యి ఆర్టీసి బస్సులు.. ఇతర ప్రైవేట్ వాహనాలు. కార్లు,ట్రక్కులు, ఆటోల్లో జనం తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.. 11 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు..సభను విజయవంతం చేయాలని తెలంగాణ కమలనాథులు శ్రమటోడుస్తున్నారు.