Business

సెప్టెంబర్‌ నెలలో బ్యాంకు సెలవుల వివరాలు

సెప్టెంబర్‌ నెలలో బ్యాంకు సెలవుల వివరాలు

సెప్టెంబరులో ఏకంగా 16 రోజులు బ్యాంకులు పనిచేయవు. ముఖ్యంగా పండుగ సీజన్‌ కావడంతో ఆగస్టు లో 14 సెలవులతోపోలిస్తే సెప్టెంబరులో 16కు పెరిగాయి. వీటిల్లో శని, ఆదివారాలతో పాటు వివిధ పండుగల సెలవులు కూడా ఉన్నాయి. ఈ సెలవులను దృష్టిలో పెట్టుకుని ఖాతాదారులకు తమ తమ బ్యాంకు పనులును చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలను యథావిధిగా వినియోగించుకోవచ్చు. కేంద్ర బ్యాంకు ఆర్‌బీఐ విడుదల చేసిన బ్యాంక్​ సెలవుల జాబితాను చూద్దాం.

2023 సెప్టెంబర్‌లో బ్యాంక్​ సెలవులు

సెప్టెంబర్​ 3: ఆదివారం
సెప్టెంబర్​ 6 : శ్రీ కృష్ణ జన్మాష్టమి, కొన్ని ప్రాంతాల్లో సెలవు.
సెప్టెంబర్​ 7: జన్మాష్టమి
సెప్టెంబర్​ 9: రెండో శనివారం.
సెప్టెంబర్​ 17: ఆదివారం
సెప్టెంబర్​ 18: వినాయక చవితి(కొన్ని ప్రాంతాల్లో)
సెప్టెంబర్​ 19: వినాయక చవితి కొన్ని ప్రాంతాల్లో సెలవు
సెప్టెంబర్​ 20: వినాయక చవితి రెండో రోజు, నౌఖై (ఒడిశా)
సెప్టెంబర్​ 22: శ్రీ నారాయణ గురు సమాధి డే
సెప్టెంబర్​ 23: నాలుగో శనివారం, మహారాజ హరి సింగ్​ జయంతి
సెప్టెంబర్​ 24: ఆదివారం
ప్టెంబర్​ 25: శ్రీమత్​ సంకరాదేవ జయంతి
సెప్టెంబర్​ 27: ఈద్​-ఈ- మిలాద్​
సెప్టెంబర్​ 29: ఇంద్రజాత్ర, జమ్ముకశ్మీర్‌లో సెలవు