Politics

అధిష్టానం అక్కర్లేదు. నేను చెప్పిన అభ్యర్థికే టిక్కెట్టు.

అధిష్టానం అక్కర్లేదు. నేను చెప్పిన అభ్యర్థికే టిక్కెట్టు.

నకిరేకల్‌ నియోజకవర్గంలో తానే నాయకుడినని, తాను చెప్పిందే ఫైనల్‌ అని, పార్టీ కార్యకర్తలు ప్రతిపాదించిన వ్యక్తికే ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టంచేశారు. నకిరేకల్‌ నియోజకవర్గ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామంలో శనివారం తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో ఎంపీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘‘ఎవరో పార్టీలో చేరతారు. ఇంకెవరో అభ్యర్థి అనే ప్రచారాన్ని నమ్మొద్దు. అధిష్ఠానంతో సంబంధం లేకుండా నేను ఎవరి పేరును ప్రతిపాదిస్తే వారికే టికెట్‌ వస్తుంది. నిన్నటి వరకు వేముల వీరేశం భారాస టికెట్‌ వస్తుందని ఆశించారు. టికెట్‌ రాదని తెలిసే సరికి కేసీఆర్‌ ఫొటో పక్కన పెట్టి కాంగ్రెస్‌ అంటున్నారు. సోమవారం నార్కట్‌పల్లి పట్టణంలో కార్యకర్తలతో మరో సమావేశం నిర్వహించి, వారి నుంచి అభ్యర్థనలు స్వీకరిస్తాం. రాష్ట్రంలో మరో నాలుగు నెలల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతోంది. టికెట్‌ రాని నాయకులకు న్యాయం జరుగుతుంది’’ అని హామీ ఇచ్చారు.