సెల్ ఫోన్ ను కేవలం మాట్లాడడానికి, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి మాత్రమే యూస్ చేస్తూ ఉంటారు. కానీ ఇండియాలో సెల్ ఫోన్ ను డబ్బులు దాచుకోవడానికి కూడా ఉపయోగిస్తారు. అయితే చాలామంది సెల్ఫోన్ కవర్ వెనకాల కరెన్సీ నోట్లు పెడుతూ ఉంటారు. మరి అలా కరెన్సీ నోట్లు సెల్ఫోన్ వెనకాల పెట్టడం వల్ల కలిగే ప్రమాదం ఏంటో ఇప్పుడు చూద్దాం..స్మార్ట్ ఫోన్ కవర్ లోపలి వైపు కరెన్సీ నోట్లు పెట్టడం వల్ల మన ప్రాణాలకే ప్రమాదం. ముఖ్యంగా సెల్ఫోన్ వాడుతున్న సమయంలో హీటెక్కుతుంది. హీట్ అయిన తర్వాత దాని నుండి వేడి బయటకు వెళ్లిపోవాలి. అలా వెళ్లే ప్రాంతంలో మనం ఈ నోటును అడ్డు పెట్టడం వల్ల ఆ వేడి మరింత పెరిగిపోయి సెల్ ఫోన్ పేలే అవకాశం ఉంటుంది. అప్పటికే బిగుతుగా ఉండే కవర్లు సెల్ఫోన్ కు బిగిస్తారు.దానికి తోడు ఈ నోట్లు పెట్టడం వల్ల మరింత బిగుతూ అయిపోయి కనీసం దాని నుండి వేడి ఏ మాత్రం కూడా బయటకు వెళ్లదు. కాబట్టి సెల్ఫోన్ వెనకాల అమౌంట్ పెట్టడం, ఇతరాత్రా ఏటీఎం కార్డులు లాంటివి పెట్టడం మానుకోవాలి.