WorldWonders

అక్కడ పిల్లలు బడి మానేస్తే తల్లిదండ్రులకు జైలుశిక్ష

పిల్లలు బడి మానేస్తే తల్లిదండ్రులకు జైలుశిక్ష ఎక్కడంటే?

పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే దిశగా సౌదీ అరేబియా (Saudi Arabia) ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. సరైన కారణం లేకుండా 20 రోజులకు మించి స్కూల్‌కు విద్యార్థి డుమ్మా కొడితే ఆ పిల్లాడి తల్లిదండ్రులకు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. చైల్డ్‌ ప్రాటెక్షన్‌ లా కింద వీరిని శిక్షిస్తారు. ఈ విధానాన్ని రానున్న విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.20 రోజులకు మించి విద్యార్థి స్కూల్‌కు సరైన కారణం లేకుండా సెలవు పెడితే దాన్ని ఆ విద్యార్థి సంరక్షకుడిని నిర్లక్షంగా పేర్కొంటూ అతడిని బాధ్యుడిని చేస్తారు. ఇందుకు కోర్టు తల్లిదండ్రులకు జైలు శిక్ష విధించొచ్చని చట్టం చెబుతోంది. అయితే, ఎవరైనా పిల్లాడు స్కూల్‌కు హాజరు కాకపోతే ఆ విషయాన్ని స్కూల్‌ ప్రిన్సిపల్‌.. తొలుత విద్యాశాఖ అధికారులకు తొలుత తెలియజేయాల్సి ఉంటుంది. ఆపై విద్యాశాఖ దర్యాప్తు చేపడుతుంది. తర్వాత కుటుంబ సంంరక్షణ విభాగం ఆ పిల్లాడి వాంగ్మూలం తీసుకుంటుంది. ఆ తర్వాత సంరక్షకుడిపై విచారణ జరిపి కోర్టు ముందు ఉంచుతారు. దీనిపై న్యాయమూర్తి విచారణ జరిపి తీర్పు వెలువరిస్తారు.