ScienceAndTech

లెన్స్ కోసం కన్నీళ్లతో బ్యాటరీ ఛార్జ్

లెన్స్ కోసం కన్నీళ్లతో బ్యాటరీ ఛార్జ్

సింగపూర్‌కు చెందిన నాన్యాంగ్‌ టెక్నలాజికల్‌ వర్సిటీ పరిశోధకులు అద్భుత ఆవిష్కరణ చేశారు. కన్నీళ్లతో రీచార్జ్‌ అయ్యే బ్యాటరీని రూపొందించి అందరినీ అబ్బురపరిచారు. మైక్రోమీటర్‌ మందం గల ఈ బ్యాటరీని 200 సైకిల్స్‌ వరకూ రీచార్జ్‌ చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి వైర్లు, భారీ విషపూరిత లోహాలు లేవు. ఈ బ్యాటరీ స్మార్ట్‌ కాంటాక్ట్‌ లెన్స్‌కు పవర్‌ను అందజేస్తుంది. కండ్లకు ఎలాంటి హాని కలగకుండా కన్నీళ్లతో రీచార్జ్‌ అయ్యేలా బ్యాటరీని రూపొందించామని, ఇందులో ఎలాంటి లోహాలను వాడలేదని పరిశోధనకు నేతృత్వం వహించిన వర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ లీ సియోక్‌ వూ వెల్లడించారు.