Movies

KGF2 రికార్డులు కొల్లగొట్టిన గదర్-2

KGF2 రికార్డులు కొల్లగొట్టిన గదర్-2

ఎప్పుడో సోలో హీరోగా మార్కెట్‌ కోల్పోయిన ఒక హీరో ఊహకందని రేంజ్‌లో స్టార్‌ హీరోల సినిమాలను దాటేస్తాడంటే గదర్‌-2 ముందు వరకు అవి వట్టి మాటలే అనిపించేవి. కానీ గదర్‌-2 సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం బాలీవుడ్‌ ట్రేడ్‌ను సైతం ఆశ్చర్యపరుస్తుంది. రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్న సిన్నీ డియోల్ ఈ రేంజ్‌లో హిట్టు కొడతాడని బహుశా ఆయన కూడా ఊహించి ఉండడు. ఇప్పటికే ఎన్నో ఏరియాల్లో ఖాన్‌ల, కపూర్‌ల రికార్డులను బద్దలు కొడుతూ బాలీవుడ్‌నాట సరికొత్త రికార్డులు తిరగరాస్తున్నాడు. తాజాగా ఈ సినిమా కేజీఎఫ్‌-2 రికార్డును బ్రేక్‌ చేసి సంచలనం సృష్టించింది. కేజీఎఫ్‌ హిందీ లైఫ్‌ టైమ్‌ కలెక్షన్‌లు(రూ.435 కోట్లు)ను బ్రేక్‌ చేసి గదర్‌-2 సినిమా సరికొత్త ప్రభంజనం సృష్టించింది. తాజాగా గదర్‌-2 సినిమా హిందీ బాక్సాఫీస్‌ దగ్గర రూ.439 కోట్లు కలెక్ట్‌ చేసింది. ఇదే జోరు కొనసాగితే బాహుబలి సీక్వెల్‌ కలెక్షన్‌లు(రూ.511 కోట్లు) కూడా బ్రేక్‌ చేసే చాన్స్‌ లేకపోలేదు. అప్పుడెప్పుడో ఇరవైఏళ్ల కిందట వచ్చిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ తీస్తే ఎవరు చూస్తారని ఎంతో మంది అన్నారని సన్ని డియోల్‌ ఓ సందర్భంలో చెప్పాడు. ఇరవైఏళ్లా, ముప్పయేళ్లా అని కాదు సరైన కథ, కథనం ఉంటే దశాబ్దాలు దాటిన సినిమా సీక్వెల్‌తో కూడా సరికొత్త రికార్డులు తిరగరాయోచ్చని గదర్‌-2 సినిమా నిరూపిస్తుంది.