ScienceAndTech

చంద్రుని ఉష్ణోగ్రత పరీక్ష నివేదికను పంపిన రోవర్

చంద్రుని ఉష్ణోగ్రత పరీక్ష నివేదికను పంపిన రోవర్

దాదాపు 3 లక్షల 84 వేల 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ అధ్యయనం వేగవంతమైంది. చంద్రుడిపై అధ్యయనం ప్రారంభించిన ప్రజ్ఞాన్ రోవర్ గురించి ఇన్‌స్టంట్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్న ఇస్రో ఇప్పుడు మరో పెద్ద అప్‌డేట్ ఇచ్చింది. ఈసారి ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని ఉష్ణోగ్రత నివేదికను పంపింది. రోవర్ పగటి ఉష్ణోగ్రత 50 సెల్సియస్ నుంచి 10 సెల్సియస్ వరకు ఉందని ఒక నివేదికను పంపింది. ఈ సమాచారాన్ని ఇస్రో ట్వీట్ ద్వారా తెలిపారు.చంద్రుడి ఉపరితలంపై 10సెం.మీ. లోతు వరకు ఉపరితలాన్ని అధ్యయనం చేసిన ప్రజ్ఞాన్ రోవర్ తొట్టతొలిసారి చంద్రుడి దక్షిణ ధృవం వద్దనున్న నేలకి సంబంధించిన సమాచారాన్ని భూమికి చేరవేసింది. ఈ పరిశీలనలో చంద్రుని దక్షిణ ధృవం వద్ద ఉన్న మట్టిని విశ్లేషించగా.. ఉపరితలం క్రింద 10 సెంటీమీటర్ల వరకు ఉష్ణోగ్రత లోతును బట్టి హెచ్చుతగ్గులను కలిగి ఉందని ఇస్రో తెలిపింది. చంద్రుడి దక్షిణ ధృవం నేలకి సంబంధించి ఉష్ణోగ్రతలకు సంబంధించిన హెచ్చుతగ్గుల సమాచారం ప్రపంచానికి చేరడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. చంద్రునిపై చేసిన పరిశోధనల్లో ప్రోబ్‌ లోతుకు చొచ్చుకు పోతున్న కొలది ఉష్ణోగ్రతలు నమోదు చేయబడ్డాయి. లోతు పెరుగుతున్న కొద్దీ చంద్రుని ఉపరితలం ఉష్ణోగ్రత తగ్గుతుందని తెలిసింది.