NRI-NRT

తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 పాఠశాలల్లో CPR శిక్షణ

తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 100 పాఠశాలల్లో CPR శిక్షణ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది డిసెంబరు లోగా 100 పాఠశాలల్లో CPR-AED శిక్షణా తరగతులు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఫౌండేషన్ ఛైర్మన్ వల్లేపల్లి శశికాంత్, అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్‌లు తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా గుండెపోటుకు గురైనప్పుడు, అత్యవస సమయాల్లో చేయాల్సిన చికిత్సపై అవగాహనను కల్పిస్తామని వీరు తెలిపారు.

ఈ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో భాగంగా శనివారం నుండి బుధవారం వరకు గుంటూరులోని 7 పాఠశాలల్లో ఈ CPR-AED కార్యక్రమాన్ని ఫౌండేషన్ ట్రస్టీ ఎండూరి శ్రీనివాస్ సమన్వయంలో ఏర్పాటు చేశాఅమని వారు తెలిపారు. తానా న్యూఇంగ్లాండ్ ఆర్‌ఆర్ కృష్ణ ప్రసాద్ సోంపల్లి, డాక్టర్ ఓ.కె. మూర్తి ఈ శిక్షణా కార్యక్రమంలో అవగాహన కల్పిస్తున్నారు. భాష్యం, శ్రీ పాటిబండ్ల సీతారామయ్య పాఠశాలల్లో జరిగిన కార్యక్రమంలో ఎన్నారైలు సూర్య తెలాప్రోలు, దగ్గుబాటి సురేష్, కరెస్పాండెంట్ పాటిబండ్ల విష్ణువర్థన్, ప్రిన్సిపాల్ షఫీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

TANA Foundation To Conduct CPR Training in 100 Schools
TANA Foundation To Conduct CPR Training in 100 Schools