Devotional

దేవాలయ గోపుర శిఖరంపై ఉన్న బంగారు కలశం అదృశ్యం

దేవాలయ గోపుర శిఖరంపై ఉన్న బంగారు కలశం అదృశ్యం

కృష్ణా జిల్లా గుడివాడ మండలం సిద్ధాంతం గ్రామ శివాలయంలోని బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయ గోపుర శిఖరంపై ఉన్న బంగారు కలశం అదృశ్యమైంది. ఆలయ గోపురాలపై ఉన్న రెండు శిఖరాలకు ధర్మకర్తలు 12 ఏళ్ల క్రితం బంగారు కలశాలను ఏర్పాటు చేశారు. ఈ కలశాలు ఒక్కొక్కటి కిలోకుపైగా బరువు ఉంటాయని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆలయాన్ని పర్యవేక్షించే వ్యక్తి అమ్మవారి గోపుర శిఖరంపై ఉండాల్సిన బంగారు కలశం కనిపించకపోవడాన్ని గుర్తించి ధర్మకర్తలకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్సై సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆలయం పైవరకు మర్రి చెట్టు విస్తరించి ఉండటంతో ఈదురు గాలులకు కొమ్మలు కలశానికి తగులుతున్నట్లు ఇటీవల ఆలయ నిర్వాహకులు గుర్తించారు. ఒకవేళ గాలులకు కలశం విరిగిపోతేే కోతులు పడేసి ఉంటాయని.. దాన్ని ఎవరైనా పట్టుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.