Politics

రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ మీనాకు అచ్చెన్నాయుడు లేఖ

రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ మీనాకు అచ్చెన్నాయుడు లేఖ

రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ మీనాకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. తాడికొండ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా తయారీ ఎన్నికల సంఘం నిబంధనల కు విరుద్ధంగా జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. ఒక వార్డులో ఉన్న వాళ్ళను ఒక బూత్ కు కాకుండా 8 వేర్వేరు బూత్ లకు కేటాయించారని వివరించారు. 150 మంది మృతుల ఓట్లను కూడా తొలగించలేదని వెల్లడించారు. సున్నా ఇంటి నెంబర్ తో 53 ఓట్లు ఉన్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు కోరారు.