దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ చిత్రంతో ఉన్న రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్ లోని సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆసక్తికరం సన్నివేశం కనిపించింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు మాట మంతీ సాగింది. పక్కపక్కన కూర్చున్న ఇద్దరు నేతలూ ఏదో అంశంపై సీరియస్‌గా చర్చిస్తూ కనిపించారు. వారి పక్కనే నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణం రాజు కూర్చున్నారు.మరోవైపు జేపీ నడ్డాతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ ‘చాయ్ పే చర్చ’లో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, రఘురామకృష్ణంరాజు, సీఎం రమేశ్ తదితర నేతలు కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీ, దేశ రాజకీయాలపై ఇద్దరు నేతలు చర్చించారని, ఏపీలో ఓట్ల తొలగింపు అంశాన్ని నడ్డా దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లారని చర్చ జరుగుతోంది.