WorldWonders

మరో ఐదారేళ్లలో హైదరాబాద్‌లో భారీ భవంతులు

మరో ఐదారేళ్లలో హైదరాబాద్‌లో భారీ భవంతులు

రాబోయే ఐదారేళ్లలో హైదరాబాద్‌(Hyderabad) రూపురేఖల్ని మరింతలా మార్చే భారీ భవంతులు రాబోతున్నాయి. ఆకాశమే హద్దుగా.. నగర వాసులకు చుక్కల్ని అందుకొనే అనుభూతి పంచేలా భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. 48 అంతస్తుల నుంచి గరిష్ఠంగా 59 అంతస్తులతో అతి ఎత్తైన టాప్‌-10 భవనాల ప్రణాళికలకు ఆమోదం తెలిపినట్టు పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ వెల్లడించారు. వీటిలో కనీసం ఐదు భవంతులు కోకాపేట/నియోపోలిస్‌ ప్రాంతాల్లోనే ఉన్నట్టు తెలిపారు. పుప్పాలగూడలో 59 అంతస్తులతో భవన సముదాయం 2029 మార్చి నాటికి పూర్తవుతుందని అర్వింద్‌ కుమార్‌ తెలిపారు.అలాగే, ఎత్తైన భవనాల్లో ముంబయి తర్వాత రెండో స్థానంలో హైదరాబాద్‌ ఉందని ఎక్స్‌ (ట్విటర్‌)లో పేర్కొన్నారు. టాప్‌ 10 ఎత్తైన భవనాల వివరాలతో ఓ పట్టికను షేర్‌ చేశారు. ఇందులో ప్రాజెక్టు పేరు, సైట్‌ లొకేషన్‌, ఎన్ని అంతస్తులు? అనుమతులు జారీ చేసిన తేదీతో పాటు ఎప్పటికి పూర్తవుతుందనే వివరాలను పొందుపరిచారు. ఎత్తైన టాప్‌ 10 భవంతుల వివరాలివే..