కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గత కొంతకాలంగా ప్రజలతో మమేకం అవుతున్నారు. వరుస టూర్లతో సందడి చేస్తున్నారు. స్థానిక జనంతో కలిసి సందడి చేస్తున్నారు. తాజాగా ఊటీలోని చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించిన రాహుల్‌గాంధీ.. అక్కడ కార్మికులతో కలిసి చాక్లెట్ ఎలా తయారు చేస్తారో నేర్చుకున్నారు. అవును నిత్యం పాలిటిక్స్‌లో బిజీగా ఉండే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఊటీలో సందడి చేశారు. వయనాడ్ వెళ్తూ.. మార్గం మధ్యలో ఊటీలోని ఓ చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించారు.ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ సక్సెస్ ఫుల్ గా నడిస్తోందని.. అక్కడ పనిచేస్తున్నవారంతా మహిళలే అని తెలుసుకున్నారు రాహుల్ గాంధీ. అంతేకాదు మహిళపై ప్రశంసల వర్షం కురిపించారు. సుమారు 70 మంది మహిళలు ఆ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. చాక్లెట్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న చాకెట్లు రుచి చూసిన రాహుల్ గాంధీ.. వాటి టెస్టుకు వావ్ అన్నారు. రాహుల్ గాంధీ చాకోలెట్ ఫ్యాక్టరీలో ఉన్నప్పుడు వీడియోను రాహుల్ గాంధీ స్వయంగా షేర్ చేశారు.
ఫ్యాక్టరీలో పనిచేసే మహిళలతో రాహుల్ ముచ్చటించారు. ఫ్యాక్టరీలో చాక్లెట్ తయారీ విధానాన్ని తెలుసుకున్నారు. అంతేకాదు చాక్లెట్ ను రాహుల్ గాంధీ ఆ మహిళలతో కలిసి తయారు చేశారు. ఆ సమయంలో ఈ ఫ్యాక్టరీపై ఎంత జీఎస్టీ విధిస్తారో రాహుల్ ఫ్యాక్టరీ యజమాన్యంను ప్రశ్నించారు.18శాతం జీఎస్టీ కడుతున్నట్లు తెలుసుకున్న రాహుల్.. ఈ సమస్య మీ ఒక్కరిదే కాదని.. దేశం మొత్తానికి సంబంధించిందని అన్నారు. అనంతరం ఓ చిన్నారి నుంచి రాహుల్ ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. మోడిస్ చాక్లెట్ల కథ భారతదేశం యొక్క సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల గొప్ప సామర్థ్యానికి ఒక గొప్ప సాక్ష్యం అని రాహుల్ చెప్పారు. మరోవైపు ఇటీవల లద్దాఖ్‌లో తొలిసారి పర్యటించిన రాహుల్ గాంధీ.. బైక్ రైడ్ చేపట్టారు. లద్దాఖ్ పాంగాంగ్ సరస్సు వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. స్పోర్ట్స్‌బైక్‌ను నడుపుతూ రాహుల్ ఎంజాయ్ చేశారు. లద్దాఖ్‌లో తొలుత రెండు రోజుల పాటు పర్యటించాలని అనుకున్న ఆయన తన పర్యటనను పొడిగించుకున్నారు.